అమలాపురం విధ్వంస సంఘటన పరిష్కారానికి నాయకులంతా చేయూతనివ్వాలి. కులం,మతం,వర్గం అన్న తారతమ్యం లేకుండా మనకు స్వేచ్ఛా స్వతంత్రాన్ని ప్రసాదించిన రాజ్యాంగ రచయిత అంబేద్కర్ పేరు పెట్టడం ఎంత గర్వకారణం. అలాంటి దానిని కూడా వివాదం చేయడం శోచనీయం. ఇది పూర్తిగా వర్గ విభేదాల పర్యవసానం అనిపిస్తోంది. ఇంతే సంఘటితంగా అందరు యువకులు పని చేస్తే ఎంత అభివృద్ధి జరుగుతుంది. విధ్వంసానికి మన శక్తిని ఉపయోగించడం ఎంతవరకు సమంజసం.? యువత ఒక్కసారి ఆలోచించాలి. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి గాని నాశనం చేసుకోకూడదు. పోలీస్ కేసులో ఉంటే ఉద్యోగాలు రావు. జీవితం సర్వనాశనం అవుతుంది. ఉద్వేగానికి లోనుకాకుండా యువకులను బయటకు వెళ్ళకుండా తల్లిదండ్రులను చూడమనండి. మన పార్టీని విడదీయడానికి ఉద్దేశపూర్వక అల్లర్లు ఇవి అని తెలియజేయండి. అమలాపురంలో కాపు,బీసీ, మాల, మాదిగ నాయకులను కార్యకర్తలను యాక్టివ్ట్ అవ్వమని చెప్పండి. ముఖ్యంగా బలిజ మరియు కాపు నాయకులకు తెలియజేయండి.
– తానేటి వనిత – హోం మంత్రి