” సహజీవనం” ప్రస్తుతం సొసైటీ లో బాగా ఎక్కువ ఎక్కువ వినిపిస్తున్న మాట ఇది. ఫలానా వారు ఫలానా వారితో కలిసి సహజీవనం చేస్తున్నారట అనే మాటలు ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట మనం వింటున్నాం. అయితే అసలు ఈ సహజీవనం అంటే ఏమిటి..? సహజీవనం లో పొందేటి ఏమిటి..? మనిషి నూరేళ్ళ జీవితంలో ఒంటరిగా జీవించడం అన్నది దాదాపు సాధ్యం అయ్యే పని కాదు.
ఎందుకంటే పుట్టిన దగ్గరి నుంచి ఆఖరి శ్వాస వరకు మనకు ఎవరో ఒకరు తోడు కావాలి. చిన్నప్పుడు తల్లితండ్రులు, బాల్యంలో అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు, యవ్వనంలో ఉన్నప్పుడు స్నేహితుల దగ్గర, తరువాత ఒక వయసుకు వచ్చాక భాగస్వామి భార్య / భర్త ఇలా జీవితంలో ప్రతి స్టేజిలో మనకు ఒక తోడు కావాలి. మన కష్ట సుఖాలను వారితో పంచుకుంటాం.
అయితే కొన్ని సార్లు అభిప్రాయ భేదాల కారణం చేత, లేదంటే మరేదైనా కావచ్చు మన కుటుంబ సభ్యులకు మనకు మధ్య దూరం ఏర్పడుతుంది. అలాంటప్పుడు మనలో ఒంటరి తనం చోటు చేసుకుంటుంది. అటువంటప్పుడు మనం మనకోసం ఒక వ్యక్తి ఉంటే బావుండు అని ఆలోచన నుంచి మొదలవుతుంది. మన ఆలోచనలను పంచుకోవడానికి, కొన్ని బాధ ల నుండి మనసు స్వాంతన పొందడానికి ఒకరి సహచర్యం అవసరం అవుతుంది.
సహజీవనం చేసేవారు ఏ కష్టం లేకుండా ఉంటారు అని కాదు, సహజీవనం చేస్తే బాధలు తొలగిపోతాయి అని కాదు ఇక్కడ ఏవి ఎలా ఉన్నా సహచర్యం చేసే భాగస్వామి దగ్గర అన్ని మరచిపోయి ప్రశాంతత లభిస్తుంది. కానీ సహజీవనం చేస్తున్న అందరూ ఇలానే ఉంటారని లేదు, ప్రతీది స్వార్థం కోసమే నడుస్తున్న ఈ రోజుల్లో దీనిని కూడా వారి స్వార్థానికి ఉపయోగించే వారు ఎందరో.
అటువంటి వాటిలో ఆకర్షణ తగ్గిపోయాక వారి సహజీవనం ఎక్కువ కాలం కొనసాగదు. ఇలా అవసరాలకు సహజీవనం చేసేవారు వారి అవసరాలు తీరాక విడిపోతారు. నిజమైన సహచర్యంలో సహచరి భాగస్వామి ప్రోత్సాహం తో ఉన్నత స్థాయిని చేరుకున్నవారు ఉన్నారు. మోసపోయిన వారు ఉన్నారు.