తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా సక్సెస్ అవ్వాలని కలలు కన్న తారకరత్న అనుకున్నంత స్థాయిలో హీరోగా ఇమేజ్ ను సొంతం చేసుకోలేకపోయారు. ఆ తర్వాత సినిమాలకు దూరమై ఇటీవల రాజకీయాలలోకి అడుగు పెట్టాలని అనుకున్నారు ఈ క్రమంలోనే లోకేష్ పాదయాత్ర జనవరి 27 ఉదయం మొదలవగా అప్పటికే తారకరత్న అస్వస్థకు ఫీలయ్యారని సమాచారం. తారకరత్న పాదయాత్రలో పాల్గొని ఎండలో తిరగడంతో పాటు వేలమంది జనాల మధ్య సగం నలిగిపోయారు. అక్కడే ఆయన సొమ్మసిల్లి పడిపోయారని సమాచారం. అయితే అదే సమయంలో గుండెపోటు రావడంతో కొంత సమయం రక్త ప్రసరణ ఆగిపోవడంవల్లే మెదడులో రక్తం గడ్డకట్టింది.
ఎంతగా కష్టపడినా సరే తారకరత్న ఆ సమస్య నుంచి పూర్తిస్థాయిలో కోలుకోలేదు. దీంతో నిన్న రాత్రి ఆయన తుది శ్వాస విడిచారు. నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న బ్రెయిన్ డ్యామేజ్ కావడం వల్ల కోమాలోకి వెళ్లారు. షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల గుండెపోటు వచ్చింది. వేరువేరు ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా తారకరత్న ఆరోగ్యం పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపిందని సమాచారం.. ఇకపోతే పాదయాత్రలో భాగంగా ఆయనకు గుండెపోటు వచ్చినప్పుడు వెంటనే కింద పడిపోయారు. ఆ సమయంలో సీ పీ ఆర్ గనుక వెంటనే చేసి ఉండి ఉంటే తారకరత్న బ్రతికి ఉండేవారు. కానీ ఆయనకి గుండెపోటు వచ్చి పడిపోయిన 45 నిమిషాలకు సిపిఆర్ చేయడంతో ఫలితం లేకుండా పోయింది అప్పటికే జరగాల్సిన అనర్ధం జరిగిపోయింది.
ఆయన మరణం తెలిసి సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు ట్వీట్ ల ద్వారా వెల్లడిస్తున్నారు. భౌతికంగా మరణించినప్పటికీ ఆయన సినిమాల ద్వారా అభిమానుల హృదయాలలో జీవించే ఉంటారని చెప్పవచ్చు.