బీపీ మాత్రలు రాత్రిపూట‌ వేసుకుంటే.. ఏం అవుతుందో తెలుసా..?

-

ఇటీవ‌ల కాలంలో లో బీపీ లేదా హై బీపీ అంటూ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. చూడ్డానికి బాగానే కనిపించినా..చాలా మందిలో ఈ సమస్య ఉంటుంది. ఉప్పు, మసాలాలు ఉన్న ఆహారం ఎక్కువగా తినడం, పచ్చళ్లు అధికంగా తినడం, మద్యం సేవించడం, ఒత్తిడి, ఆందోళనలతో కూడిన బిజీ లైఫ్, సరైన పౌష్టికాహారం టైముకు తినకపోవడం, వ్యాయామం చేయకపోవడం… ఇలా చెప్పుకుంటూ పోతే బీపీ పెరిగేందుకు చాలా కారణాలే ఉన్నాయి. ఇకదీన్ని తగ్గించుకోవ‌డానికి మెడిసిన్ వాడుతుంటారు. అయితే బీపీ ఉన్నవారు రాత్రి సమయంలో మాత్రలు వేసుకుంటేనే మెరుగైన ఫలితాలు ఉంటాయని పరిశోధకులు తేల్చారు.

సాధారణంగా బీపీ ఉన్నవారు ఉదయం లేవగానే మందులు వేసుకొంటారని వైద్యులు సూచిస్తుంటారు. ఈ పద్ధతి కన్నా రాత్రుళ్లు ఈ మాత్రలు వేసుకుంటేనే బీపీ అదుపులో ఉంటుందని స్పెయిన్ పరిశోధకులు అంటున్నారు. బీపీ మాత్రలను రాత్రి నిద్రపోయే ముందు వేసుకుంటే బీపీని అదుపులో ఉంచడమే కాకుండా గుండెపోటు లాంటి వ్యాధులకు గురయ్యే ప్రమాదం కూడా సగానికి తగ్గిందని పరిశోధకులు తేల్చి చెప్పారు. దాదాపు ఆరేళ్ల పాటు 19,000 మందిపై జరిపిన పరిశోధనల ఫలితంగా ఈ వివరాలను వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version