బన్నీ – సుకుమార్ మూవీ టైటిల్ పై క్లారిటీ ఇచ్చిన యూనిట్…..ఏమన్నారంటే…??

-

గతంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, వెరైటీ సినిమాల దర్శకుడు సుకుమార్ ల కాంబినషన్ లో వచ్చిన ఆర్య, ఆర్య సినిమాల్లో ఆర్య మంచి సక్సెస్ సాధించగా, ఆర్య 2 మాత్రం ఫెయిల్ అయింది. ఇక ఇటీవల రామ్ చరణ్ తో రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ ని అందుకున్న సుకుమార్, ప్రస్తుతం బన్నీతో చేస్తున్న సినిమాపై బాగానే దృష్టిపెట్టాడు. ఇకపోతే మరోవైపు బన్నీ కూడా ఇటీవలి అలవైకుంఠపురములో సక్సెస్ తో మంచి జోష్ మీదనున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం వీరిద్దరూ కలిసి చేస్తున్న సినిమా కొద్దిరోజుల క్రితం శేషాచలం అడవుల్లో ప్రారంభం అయింది. ఇక ఈ సినిమా షూటింగ్ లో బన్నీ అతి త్వరలో పాల్గొననున్నారు.

రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని ఎంతో భారీగా నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు సుకుమార్ చేసిన సినిమాలకు భిన్నంగా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో మంచి మాస్, యాక్షన్ ఎంటెర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరో, హీరోయిన్లు ఇద్దరూ కూడా మంచి మాస్ క్యారెక్టర్స్ లో దర్శనమిస్తారని టాక్. ప్రముఖ కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

 

అయితే ఈ సినిమాలో బన్నీ పేరు శేషు అని, అలానే సినిమా కూడా చాలా వరకు శేషాచలం అడవుల నేపథ్యంలో సాగుతుండడంతో సినిమాకు శేషాచలం అనే టైటిల్ ని నిర్ణయించినట్లు గా వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఈ విషయమై నేడు సినిమా యూనిట్ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. తమ సినిమాకు ఇప్పటివరకు టైటిల్ నిర్ణయం కాలేదని, అతి త్వరలోనే యూనిట్ అందరూ కలిసి చర్చించిన తరువాత అధికారికంగా దానిని ప్రకటించడం జరుగుంతుందని, కావున ప్రస్తుతం టైటిల్ విషయమై వస్తున్నవి అన్ని కూడా పుకార్లే అంటూ కొట్టి పారేశారు. కాగా ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనపడుతోంది….!!

Read more RELATED
Recommended to you

Exit mobile version