స్లీప్ డివోర్స్ అంటే మీకు తెలుసా..? జపాన్ దేశ ప్రజలు ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు?

-

స్లీప్ డివోర్స్..  గత కొన్ని రోజులుగా ఇంటర్నెట్లో ఈ మాట ఎక్కువగా వినిపిస్తోంది ఇంటర్నెట్లో రోజుకో కొత్త పదం ట్రెండ్ అవుతుంటుంది. అలాగే స్లీప్ డివోర్స్ అనే మాట ట్రెండ్  అవుతుంది.

అసలు స్లీప్ డివోర్స్ అంటే ఏమిటి..?

పదంలో కనిపించినట్టుగానే భార్యాభర్తలు రాత్రి సమయంలో ఒకే చోట పడుకోకూడదు అని అర్థం. అంటే కేవలం పడుకునే సమయంలో మాత్రమే డివోర్స్ తీసుకోవడం అన్నమాట. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే భార్యాభర్తలు పడుకునే వేళల్లో ఒకేచోట కాకుండా డివోర్స్ తీసుకుని వేరువేరు ప్రదేశాల్లో నిద్రపోవడం అన్నమాట.

స్లీప్ డివోర్స్ కి కారణాలు ఏంటి..?

చాలామందికి గురకపెట్టే అలవాటు ఉంటుంది. ఇంకొంతమందికి నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది. మరి కొంతమంది చాలా ఆలస్యంగా నిద్రపోతారు, దానివల్ల లైట్ ఆన్ లో ఉంటుంది. అలా ఆన్ లో ఉన్నప్పుడు తమ భాగస్వామికి నిద్ర పట్టదు. ఎందుకంటే ఆ భాగస్వామికి లైట్ పూర్తిగా ఆఫ్ చేస్తేనే కళ్ళ మీదకు వస్తుంది.

ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు స్లీప్ డివోర్స్ పేరిట దూరంగా వేరువేరుగా పడుకుంటారన్నమాట. ఈ పద్ధతి మీద జపాన్ ఇంకా అమెరికా దేశాల ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర చాలా అవసరం. భాగస్వామికి ఉన్న అలవాట్ల కారణంగా తమకు నిద్రాభంగం అవ్వడం ఇష్టం లేని జనాలు ఈ కొత్త పద్ధతిని తెరమీదకు తీసుకువచ్చారు.

ఈ పద్ధతి వల్ల నిద్ర సుఖంగా పడుతుంది కానీ కానీ ఈ పద్ధతి వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం భార్యాభర్తలు ఇద్దరూ ఆఫీస్ పనులు చేస్తూ బిజీగా గడుపుతున్నారు.

అలాంటివాళ్లు రాత్రి ఒకపక్క మీదకు చేరుకుని సరదా సంభాషణలతో తమ బంధాన్ని దృఢపరుచుకుంటారు కానీ స్లీప్ డివోర్స్ వల్ల భాగస్వామి నుండి దూరమయ్యే అవకాశం ఉంది. బట్ బంధం గట్టిగా లేకపోయినా పర్వాలేదు తమకు నిద్ర ముఖ్యం అనుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version