పుట్టమధు అరెస్టు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అసలు ఆయనను ఎందుకు అరెస్టు చేశారన్నది కూడా పూర్తిగా క్లారిటీ రావట్లేదు. వామన్ రావు దంపతులు హత్య కేసులో అరెస్టు అయినట్టు చెబుతున్నా.. అసలు కారణం వేరే ఉందని తెలుస్తోంది. ఆయన మీద ఎప్పటి నుంచో టీఆర్ ఎస్ అధిష్టానం దృష్టి ఉందని.. సమయం కోసం వేచిచూసి అరెస్టు చేయించారంటూ ప్రచారం జరుగుతోంది.
ఇక ఇదిలా ఉండగా.. పుట్టమధును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు సంచలన విషయాలు రాబట్టుతున్నట్టు సమాచారం. ఆయనకు అత్యంత సన్నిహితుడైన ఒకరిని రామగుండంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు వీరిద్దరినీ వేర్వేరుగా ఇంటరాగేషన్ చేస్తున్నట్టు సమాచారం.
ఇక పుట్టకు మంథనిలో ఉన్న సంబంధాలేంటి, ఆయనతో టచ్ లో ఉన్న ప్రతిపక్ష, అధికార పార్టీ నాయకులెవరన్న దానిపై నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు పంపించారు. పోలీసులు. అయితే ఈ విచారణ మొత్తం టీఆర్ ఎస్ పెద్దల కనుసన్నల్లో జరుగుతోందని టాక్. కాగా ఆయనను త్వరలోనే కోర్టులో హాజరుపరుస్తారని సమాచారం. అయితే ఈటలుక సన్నిహితంగా ఉండటమే ఆయన కొంప ముంచిందని టీఆర్ ఎస్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. మరి ఆయనపై ఎలాంటి నివేదిక బయటకు వస్తుందో చూడాలి.