కరోనా ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు దాదాపు లాక్‌డౌన్ బాట పట్టాయి. మరీ ముఖ్యంగా తెలంగాణ బార్డర్ ఆనుకుని చుట్టూ ఉన్న రాష్ట్రాలన్నీ లాక్‌డౌన్ విధించాయి. కానీ తెలంగాణలో మాత్రం ఎలాంటి లాక్‌డౌన్ పెట్టలేదు. ఒకవేళ తెలంగాణ నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్లాలన్నా కష్టమే. మరి అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ నినాదం ఎత్తుకుంటే.. మన రాష్ట్రంలో మాత్రం కర్ఫ్యూతో కానిచ్చేస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఛత్తీస్‌ఘడ్, ఒడిశా, తమిళనాడులో లాక్‌డౌన్ ఉంది.
తెలంగాణలో కూడా కర్ఫ్యూ పెట్టాలని ఎప్పటి నుంచో డిమాండ్ వస్తున్నా.. ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. లాక్‌డౌన్ పెడితే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని, ప్రజల జీవనోపాధి పోతుందని కారణాలు చెబుతోంది. మరి కర్ఫ్యూతో ఏమైనా కేసులు తగ్గాయా అంటే అదీ లేదు. రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి.
అటు ఏపీలోనూ 18గంటల కర్ఫ్యూ కొనసాగుతోంది. ఇక రాకపోకలన్నీ బంద్ అయ్యాయి. మన రాష్ట్రం నుంచి ఏ రాష్ట్రానికి రానివ్వట్లేదు. రైళ్లన్నీ రద్దయ్యాయి. అటు ఢిల్లీకి వెళ్లే ఫ్లైట్లు కూడా ఆపేశారు. దీంతో అసలు ఏ రాష్ట్రంలోకి వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. మరి టీఆర్ ఎస్ ప్రభుత్వం కనీసం వీకెండ్ లాక్‌డౌన్‌పై ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా లేదా చూడాలి.