హడావుడిగా ఢిల్లీకి జగన్.. కార‌ణం ఏంటి…!

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిసి కడప స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి, అమ్మ ఒడి పథకం ప్రారంభానికి ఆహ్వానించే అవకాశం ఉంది. ఇక హోం మంత్రి అమిత్ షా ను కలిసి రాష్ట్ర పరిస్థితులపై వివరించి నిధులు అడిగే అవకాశం ఉంది. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ని కలిసి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని వివరించే అవకాశం ఉంది. కష్టాలు ఉన్నాయి సహకరించండి అని జగన్ అడుగుతారని ఇప్పుడు ప్రభుత్వ అనుకూల మీడియా వార్తలు రాస్తుంది.

అసలు ఉన్నట్టుండి ఆయన ఢిల్లీ విమానం ఎందుకు ఎక్కుతున్నారు అనేది ఎవరికి అర్ధం కాకపోయినా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు జగన్ ఢిల్లీ వెళ్ళడానికి కనపడని కారణాలు చాలానే ఉన్నాయి. ఢిల్లీలో ఉన్న ఎంపీలు విజయసాయి రెడ్డి మాటను లెక్క చేయడం లేదు. వారితో ఆయన సమావేశం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. కొంత మంది ఎంపీలు జగన్ గీసిన గీతను దాటారు. వాళ్ళతో కూడా జగన్ మాట్లాడే అవకాశం ఉందని అంటున్నారు.

అదే విధంగా… తెలుగుదేశం ఎంపీలకు, ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా వద్ద ప్రాధాన్యత ఎక్కువగా లభిస్తుంది. వాళ్లు ప‌లు స‌మ‌స్య‌ల‌పై వీళ్లిద్ద‌ర‌ని క‌లుస్తున్నారు. ఈ తరుణంలో జగన్ లో కంగారు నెలకొంది. అమిత్ షా పుట్టిన రోజు సమయంలో జగన్ ఢిల్లీ వెళ్ళారు. అప్పుడు ఆయనకు శాలువా కప్పడం మినహా ఏం మాట్లాడలేదు. దీనితో ఇప్పుడు ఆయనతో చర్చించే అవకాశం ఉందనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ఇటీవల రాష్ట్ర పరిస్థితులు అన్ని నాకు తెలుసు అని తెలుగుదేశం ఎంపీలతో అమిత్ షా వ్యాఖ్యానించారు. ఇది ప్ర‌ముఖంగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ ప‌రిణామాలే జ‌గ‌న్‌లో కంగారు కి కారణమనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version