టెన్త్ ప్యాస్ అయ్యారా..? నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుంది..? అసలు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయని తెలుసా..?

-

మీరు టెన్త్ క్లాస్ పాస్ అయ్యారా..? టెన్త్ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అనే ఆలోచనలో పడ్డారా…? అయితే కచ్చితంగా వీటిని చూడండి. టెన్త్ పాస్ అయిన తర్వాత ఏం చేస్తే బాగుంటుంది అనేది తెలుసుకోవచ్చు… విద్యార్థులు ఫలితాలు కూడా వచ్చేసాయి. తల్లిదండ్రులు విద్యార్థులు కూడా ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. పది తర్వాత ఏం చేస్తే బాగుంటుంది అనేది తెలుసుకోవాలని చూస్తున్నారు టెన్త్ తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇంటర్లో జాయిన్ అవ్వడానికి ఆసక్తి చూపిస్తారు.

టెన్త్ లో ఏ సబ్జెక్టులో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందో దానిని ఇంటర్లో తీసుకోవాలని చాలామంది చూస్తూ ఉంటారు కానీ ఎవరైనా బలవంతం చేయడంతో మళ్ళీ ఇంకో కోర్స్ లో చేరతారు. అయితే ఇంటర్ ఏ కాదు ఈ కోర్సులు కూడా వున్నాయి చూసేయండి మరి..

గురుకులాల్లో ఇంటర్ అడ్మిషన్స్..

ప్రభుత్వ గురుకులాల్లో ఇంటర్ అడ్మిషన్స్ ఉంటున్నాయి దీనికోసం ప్రత్యేకంగా నోటిఫికేషన్ వస్తుంది. ఇందులో మంచి మార్కులు వస్తే ఫ్రీగా ఇంకా చదువుకోవచ్చు.

వృత్తి విద్య…

కొంతమందికి వృత్తి విద్య మీద ఆసక్తి ఉంటుంది అప్పుడు తొందరగా జాబ్ వస్తుంది మీకు కూడా ఆసక్తి ఉన్నట్లయితే ఇలా మీరు టెన్త్ తర్వాత చేయొచ్చు.

కొత్తగా ఇలా..

10 తర్వాత సంప్రదాయ ఇంటర్ కాకుండా కాస్త కొత్తగా చేయాలనుకుంటే హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ టెక్నాలజీ డిప్లమో చేయొచ్చు.

పాలిటెక్నిక్ కూడా చేయొచ్చు..

పాలిటెక్నిక్ వలన ఉద్యోగం ఉపాధి ఉంటుంది. లేదు అంటే అగ్రికల్చర్ రంగంలోకి కూడా వెళ్ళచ్చు ఇంటర్ తో సమానంగా వ్యవసాయ అనుబంధ రంగంలో డిప్లమో కోర్సులు ఉన్నాయి ప్రభుత్వ కాలేజీలు ఫుడ్ టెక్నాలజీ కోర్సులు కూడా ఇస్తున్నాయి.

ఐటీఐ..

కావాలనుకుంటే టెన్త్ తర్వాత ఐటిఐ వైపు కూడా వెళ్ళచ్చు ప్రైవేట్ ఐటిఐ కాలేజీలు చాలా ఉన్నాయి.

జాబ్స్..

టెన్త్ తర్వాత ఉద్యోగం చేయాలనుకుంటే ప్రభుత్వాలు విడుదల చేసే నోటిఫికేషన్ చూసుకోండి ఆర్మీ నేవీ ఆర్బిఐ పోస్టల్ వంటి వాటికి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇలా టెన్త్ తర్వాత ఇన్ని అవకాశాలు ఉంటాయి టెన్త్ తర్వాత తీసుకునే స్టెప్ చాలా ముఖ్యమైనది కనుక జాగ్రత్తగా చూసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news