ఏటీఎం నుండి చిరిగిపోయిన నోట్లు వస్తే ఇలా మార్చుకోచ్చు..!

-

సాధారణంగా మనం ఏటీఎం నుండి క్యాష్ విత్ డ్రా చేసుకుంటూ ఉంటాము. అయితే క్యాష్ విత్ డ్రా చేసుకునే టప్పుడు మనకి కావాల్సిన ఎమౌంట్ ఎంటర్ చేసి.. ఏటీఎం ద్వారా తీసుకుంటాము. అటువంటి సమయంలో చిరిగిపోయిన నోట్లు వస్తే ఏం చేయాలి…?, ఎలా మార్చుకోవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

కొన్ని కొన్ని సార్లు చిరిగిపోయిన నోట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ నోట్లు మనం ఎక్కడా మార్చుకోవడానికి అవ్వదు. ఎవరూ కూడా మన దగ్గర నుంచి తీసుకోరు. అలాంటి నోట్లని మనం ఎలా మార్చుకోవచ్చు అనేది చూసేద్దాం..

ఇలాంటి చిరిగిపోయిన నోట్లని ఏ ATM నుండి తీశారో.. ఆ బ్యాంకు కి అప్లై చేసుకుని మార్చుకోవచ్చు. ఎప్పుడైతే మీరు విత్ డ్రా చేశారో ఆ తేదీ, ఆ సమయం, లోకేషన్ మరియు విత్డ్రా స్లిప్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక మీ దగ్గర స్లిప్ లేకపోతే మీ మొబైల్ కి వచ్చిన మెసేజ్ వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూల్స్ ప్రకారం కస్టమర్లు ఈ విధంగా ఫాలో అవ్వాలని చెప్పారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారమైతే ఏటీఎం నుండి ఇలాంటి నోట్లు రావు ఒకవేళ పొరపాటుని వస్తే ఎక్స్ చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం ఖాతాదారులు కంప్లైంట్ పెట్టొచ్చు అని అంది.

ఈ లింక్ ఓపెన్ చేసి https://crcf.sbi.co.in/ccf/ జనరల్ బ్యాంకింగ్ లేదా కాష్ రిలేటెడ్ కేటగిరీలోకి వెళ్ళాలి. అయితే ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం నుండి డ్రా చేస్తే మార్చుకోవడానికి మాత్రమే. ఇదిలా ఉంటే ఏ బ్యాంకు కూడా చిరిగిపోయిన నోట్లని తీసుకోవడానికి నిరాకరించరు ఒకవేళ కనుక నిరాకరిస్తే ఆ బ్యాంకు ఉద్యోగస్తులు మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version