లాక్డౌన్ సడలింపులు కరోనా మూడో వేవ్ కి కారణం కాకుండా ఉండాలంటే..

-

ప్రస్తుతం దేశంలో కరోనా (Corona) కేసులు తగ్గుతున్నాయి. సుమారు 63రోజుల తర్వాత కరోనా కేసులు లక్ష దిగువకి చేరుకున్నాయి. సెకండ్ వేవ్ ఎంతో మందిని బలి తీసుకుంది. ఎంతో మంది తమ ప్రియమైన వారిని పోగొట్టుకున్నారు. ఇప్పుడిప్పుడే ఆ బాధలు తగ్గేలా లేవు. కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ మూడవ వేవ్ భయం పెరుగుతూనే ఉంది.

లాక్డౌన్ సడలింపులు ఆ మూడవ వేవ్ కి కారణం అవుతాయా అన్న సందేహాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అదీగాక మూడవ వేవ్ పిల్లలపై ప్రభావం చూపుతుందని వస్తున్న ప్రచారాలు ఆందోళన కలగజేస్తున్నాయి. ఈ సందేహాల నడుమ సహేతుక పరిష్కారాలు ఎలా ఉన్నాయనే దానిపై నిపుణుల సమాధానాలు.

అన్నింటికంటే ముందు భయాన్ని పోగొట్టుకోవాలి. కరోనా సోకుతుందేమో అన్న భయమే ఎక్కువ ఆందోళనకి గురి చేస్తుంది. అందుకే ఆందోళన విడిచిపెట్టాలి. కరోనా కన్నా అది ప్రమాదకరమైనది. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలి. మునుపటిలా కాకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. చేతుల శుభ్రత, మాస్క్ మర్చిపోవద్దు. చిన్నపాటి నిర్లక్ష్యాలే పెద్ద వినాశనాలకి దారి తీస్తాయని గుర్తుంచుకోవాలి. అన్నింటికన్నా ముఖ్యంగా వ్యాక్సినేషన్.

మీ టర్న్ వచ్చినపుడు ఖచ్చితంగా వ్యాక్సిన్ వేసుకోండి. మీ ఇంట్లో వారికి వ్యాక్సిన్ వేయించండి. దానివల్ల ఎలాంటి ప్రమాదమూ లేదనే అవగాహన మీరే కల్పించాలి. కరోనాని అడ్డుకోవడానికి ఇదే అసలైన మందు అని గుర్తించాలి. వ్యాక్సిన్ వేసుకున్నాక కూడా నిర్లక్ష్య ధోరణి ఉండకూడదు. మొదటి వేవ్ లో అదే కొంపముంచిందని గుర్తించండి. కరోనా పోయిందన్న భ్రమలో ఉండవద్దు. ఇతర దేశాల్లో థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్ కూడా వచ్చాయని గుర్తుంచుకోవాలి.

సరైన ఆహారాలు, సరైన నిద్ర, వ్యాయామం చేయండి. ఇది మీ ఆత్మ విశ్వాసాన్ని పెంచడంలో సాయపడతాయి. కరోనా సోకినా కూడా దాన్నుండి బయటపడడానికి ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం.

Read more RELATED
Recommended to you

Exit mobile version