వామ్మో ఏంటి ఈమె నోరు ఇంత పెద్దదా.. ఏకంగా గిన్నీస్ రికార్డు కొట్టిందిగా..!

-

మ‌నం ఎన్నో ర‌కాల గిన్నీస్ రికార్డుల గురించి తెలుసుకున్నాం. ఇందులో చాలా వ‌ర‌కు ఇత‌రుల‌కు ఇన్ స్పిరేష‌న్‌గా ఉన్నా కూడా కొన్ని మాత్రం చాలా చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఎందుకంటే అలాంటి ప్ర‌త్యేక‌త‌లు కేవ‌లం ఆ వ్య‌క్తుల‌కు మాత్ర‌మే సొంతం. కొంద‌రు ఒకేసారి ఎన్నో ర‌కాలుగా సౌండ్లు చేస్తుంటారు. ఇంకొంద‌రు వారికి మాత్ర‌మే సొంత‌మైన క‌ల‌తో అబ్బుర‌ప‌రుస్తుంటారు. ఇక ఇప్పుడు కూడా ఓ మ‌హిళ కేవ‌లం త‌న నోటితోనే గిన్నీస్ రికార్డును కొట్టింది.

ఇక అంద‌రికీ ప‌రిచ‌యం అయిన టిక్ టాక్ ద్వారా మంచి ఇమేజ్ సంపాదించుకుంది అమెరికాకు చెందిన ఓ 31ఏళ్ల సమంతా రామ్‌స్‌డెల్ అనే మ‌హిళ‌. అయితే ఈమెకు ఉన్న ప్ర‌తిభ ఏంటంటే ఆమె త‌న‌కున్న అతి పెద్ద నోరును నోరు ఏకంగా 6.52 వ‌ర‌కు తెర‌వ గ‌ల‌దంట‌. అందుకు త‌న దవడలు కూడా చాలా అనువుగా ఉన్నాయ‌ని గిన్నీస్ అధికారులు చెప్పారు.

ఇదే విష‌యాన్ని తెలుసుకున్న‌ గిన్నీస్ బుక్ అధికారులు ఏకంగా ఆమెకు ఎన్నో ర‌కాలుగా టెస్టులు పెట్టి మ‌రీ నిజంగానే స‌మంతా ప్రపంచంలోనే అతిపెద్ద నోరు ఉన్న మ‌హిళ అని స‌ర్టిఫికెట్ ఇచ్చారు. కాగా స‌మంతా ఫ్యామిలీలో ఎవ్వరికీ ఇలాంటి ప్ర‌త్యేక‌మైన నోరు లేదంట‌. కేవ‌లం సామ్ కు మాత్ర‌మే ఈ విధంగా పెద్ద నోరు ఉందంట‌. ఆమె త‌న నోటిని ఏకంగా ఒక ఆపిల్ పండును కూడా అమాంతం మింగేసేంత తెరుస్తుందంట‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version