వర్షాకాలం ఆరోగ్యం: తల్లికాబోతున్న మహిళలు పాటించాల్సిన ఆరోగ్య సూత్రాలు..

-

వర్షాకాలం monsoon లో అనారోగ్యానికి గురికావడం చాలా సహజం. వాతావరణంలోని తేమ, ఒక్కసారిగా మారిన ఉష్ణోగ్రత మొదలగునవన్నీ ఆరోగ్యాలపై బాగా ప్రభావితం చూపుతాయి. అందువల్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. అదీగాక మహమ్మారి ఇంకా పూర్తిగా తగ్గలేదు. కొత్త కొత్త రూపాంతరాల వార్తలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. అందువల్ల తల్లికాబోతున్న మహిళలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాల్సిన అవసరం చాలా ఉంది.

వ్యాక్సిన్

ముందుగా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడం అన్నింటికంతే ఉత్తమం. ఈ విషయంలో మీ గైనకాలజిస్టుని సంప్రదించి సరైన నిర్ణయం తీసుకోండి. వ్యాక్సిన్ తీసుకుని మిమ్మల్ని, మీకు పుట్టబోయే బిడ్డను ఆరోగ్యంగా ఉంచుకోండి.

హైడ్రేట్

వర్షాకాలంలో అందరూ విస్మరించేది ఇదే. దాహం పెద్దగా అనిపించదు కాబట్టి నీళ్ళు తాగడంలో నిర్లక్ష్యం వహిస్తారు. మీరలా చేయకండి. వర్షాకాలంలో రోజుకి 2.5లీటర్ల నీళ్ళు తాగడం మంచిదని సూచిస్తున్నారు. ఇక్కడ డైరెక్టు నీళ్ళే అని కాకుండా ఐస్ క్రీమ్, టీ, కాఫీ మొదలగు ద్రవ పదార్థాలన్నీ వస్తాయి. అందులో నీటిశాతం కూడా లెక్కలోకి వస్తుంది.

విటమిన్ సి

రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి గల సిట్రస్ ఆహారాలను తీసుకోండి. నిమ్మ, దానిమ్మ, ఉసిరి, నారింజ మొదలగు పండ్ల పానీయాలు తాగితే మంచిది. శుభ్రంగా కడిగిన తాజా పండ్లను మాత్రమే తీసుకోండి.

శారీరక శ్రమ

చిన్నపాటి నడక, వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. అలాగే నడిచేటపుడు వేసుకునే చెప్పుల విషయంలో జాగ్రత్త వహించాలి. స్లిప్ అవకుండా ఉండే చెప్పులను వినియోగించండి. అలాగే తడిగా ఉన్న ప్రదేశాల్లో నడక మంచిది కాదు.

కోవిడ్ జాగ్రత్తలు

కరోనా మహమ్మారి ఇంకా పూర్తిగా దూరం కాలేదు. కాబట్టి, మీ చేతులని శానిటైజ్ చేసుకోవడం, మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి అస్సలు మానుకోవద్దు.

Read more RELATED
Recommended to you

Exit mobile version