ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్ ని ప్రకటించింది. వాట్సాప్ చాట్ లు ఇప్పటి వరకు వారం రోజులు, 8 గంటలు, ఏడాది పాటు మ్యూట్ చేసుకునే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు శాస్వతంగా మ్యూట్ చేసుకునే అవకాశం కల్పించింది. దీని కోసం గత కొన్ని నెలల నుంచి పరిక్షలు చేస్తుంది. ఐఓఎస్, ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ లో దీనిని పరీక్షించారు. మ్యూట్ చేసే సదుపాయం తెచ్చిన తర్వాత ఎక్కువగా వచ్చే అనవసర మెసేజెస్ నుంచి కాస్త విముక్తి లభించింది.
ఇప్పుడు ఏడాది పాటు ఉన్న మ్యూట్ ఆప్షన్ ని ఫరెవర్ అనే ఆప్షన్ తో భర్తీ చేసింది. కొత్తగా ఇచ్చే అప్డేట్ లో ఇది రానుంది. ఇప్పుడు మరో ఫీచర్ ని కూడా తీసుకొస్తుంది. ఇప్పటికే ఆపిల్ ఫోన్స్ లో ఉన్న ఫీచర్ లో చాట్ సెర్చ్ చేసుకునే వకాశం ఉండేది. ఇప్పుడు మీడియా మీడియా అనే దాన్ని కూడా యాడ్ చేసింది. ఫోటోలు, వీడియోలు, జీఐఎఫ్ లు సెర్చ్ చేసుకోవచ్చు. ఫోటోలు, జిఎఫ్‌లు, లింకులు, వీడియోలు, డాక్యుమెంట్స్ మరియు ఆడియో ని సెర్చ్ చేసుకోవచ్చు.