ఎల్ఐసి కొత్త పాలసీ.. నెల నెలా అకౌంట్‌లోకి డబ్బులు..!

-

లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా – LIC సరికొత్త పాలసీని ప్రవేశపెట్టింది. న్యూ జీవన్ శాంతి పేరుతో డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్ ‌ను ప్రకటించింది. ఇది ఇండివిజ్యువల్ సింగిల్ ప్రీమియం ప్లాన్. ఈ పాలసీ ప్రారంభించినప్పుడు నిర్ణయించిన వడ్డీ రేట్లే అమలులో ఉంటాయి. డిఫర్‌మెంట్ పీరియడ్ తర్వాత పాలసీదారుడికి ప్రతీ ఏటా జీవితాంతం యాన్యుటీ చెల్లిస్తారు. ఈ పాలసీని ఆన్‌లైన్‌ లో తీసుకోవచ్చు. ఈ పాలసీని కనీసం రూ.1.5 లక్షలకు తీసుకోవాలి. యాన్యుటీ ప్రతీ ఏటా, ఆరు నెలలకోసారి, మూడు నెలలకోసారి, నెలకోసారి చెల్లిస్తారు. కనీసం ఏడాదికి రూ.12,000 యాన్యుటీ లభిస్తుంది.రూ.5,00,000 కన్నా ఎక్కువకు పాలసీ తీసుకుంటే యాన్యుటీ ఇన్సెంటీవ్ లభిస్తుంది. ఇక ఇందులో రెండు రకాల యాన్యుటీ ఆప్షన్లు ఉంటాయి.

ఇక ఇందులో డిఫర్డ్ యాన్యుటీ ఫర్ సింగిల్ లైఫ్‌లో యాన్యుటీ పేమెంట్స్ పాలసీదారుడికి జీవితాంతం లభిస్తాయి. డిఫర్‌మెంట్ కాలంలో లేదా వారి మరణానంతరం డెత్ బెనిఫిట్‌ను నామినీకి చెల్లిస్తారు. ఇక డిఫర్డ్ యాన్యుటీ ఫర్ జాయింట్ లైఫ్‌ లో డిఫర్‌మెంట్ పీరియడ్ తర్వాత పాలసీదారుడు కోరుకున్నట్టుగా నెలకు లేదా ఏడాదికి ఓసారి డబ్బులు వస్తాయి. వారి మరణానంతరం ప్రైమరీ, సెకండరీ యాన్యుటెంట్‌ జీవించినంత కాలం యాన్యుటీ వస్తుంది. వారు కూడా మరణించిన తర్వాత డెత్ బెనిఫిట్ నామినీకి ఇస్తారు.

ఈ ప్లాన్‌ ను కనీసం 30 ఏళ్ల నుంచి 79 ఏళ్ల వ్యక్తులు తీసుకోవచ్చు. డిఫర్‌మెంట్ పీరియడ్ 1 ఏడాది నుంచి 12 ఏళ్ల వరకు ఉంటుంది. గరిష్టంగా 80 ఏళ్ల వరకే డిఫర్‌మెంట్ పీరియడ్ వర్తిస్తుంది. దివ్యాంగులు ఈ ప్లాన్ తీసుకోవాలంటే కనీసం రూ.50,000 చెల్లించాలి. ఈ పాలసీకి లోన్ సదుపాయం కూడా ఉంది. అత్యవసర పరిస్థితుల్లో పాలసీ సరెండర్ చేసి డబ్బులు వెనక్కి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎల్ఐసీ గతంలో తీసుకొచ్చిన జీవన్ శాంతి పాలసీని 6,11,695 మంది తీసుకోవడం విశేషం. ఆ పాలసీలో మార్పులు చేసి న్యూ జీవన్ శాంతి పాలసీని పరిచయం చేసింది. ఎల్ఐసీలో జీవన్ అక్షయ్ VII పాలసీ కూడా ఇలాగే యాన్యుటీని ఇస్తుంది. వీటితో పాటు SIIP, నివేశ్ ప్లస్, న్యూ ఎండోమెంట్ ప్లస్ పేర్లతో యూలిప్ పాలసీలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version