ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరొక అద్భుతమైన ఫీచర్‌ను త్వరలో యూజర్లకు అందుబాటులోకి తేనుంది. వాట్సాప్ వెబ్ యూజర్లను దృష్టిలో ఉంచుకుని ఈ ఫీచర్‌ను వాట్సాప్ ప్రస్తుతం టెస్ట్ చేస్తోంది. త్వరలోనే దీన్ని యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఇప్పటి వరకు వాట్సాప్ వెబ్‌లోకి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా లాగిన్ అయ్యేవారు. అయితే దీనికి అదనంగా ఫింగర్ ప్రింట్ ఆథెంటికేషన్ అనే ఫీచర్‌ను వాట్సాప్ ప్రవేశపెట్టనుంది. ఈ క్రమంలో వాట్సాప్ వెబ్ వాడే వారు ఎప్పటికప్పుడు కొత్త సెషన్‌కు ఫింగర్ ప్రింట్ ద్వారా ఆథెంటికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. వాట్సాప్ వెబ్‌ను వాడేటప్పుడు ఫోన్‌లో ఫింగర్ ప్రింట్ ద్వారా కన్‌ఫాం చేయమని వాట్సాప్ అడుగుతుంది. దాన్ని ఓకే చేస్తేనే వాట్సాప్ వెబ్‌లో యూజర్లు కొత్త సెషన్ ను మొదలు పెట్టవచ్చు. దీని వల్ల యూజర్లకు మరింత సెక్యూరిటీ లభిస్తుంది.
కాగా ప్రస్తుతం ఈ ఫీచర్‌ను వాట్సాప్ తన ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ యాప్‌లో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. అందువల్ల త్వరలోనే వాట్సాప్ ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని చెప్పివచ్చు. తరువాత దీన్ని ఐఓఎస్ యూజర్లకు అందిస్తారు.