దీపావళికి ముందే ఈపీఎఫ్ఓ భారీ కానుక..!

-

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అసంఘటిత రంగంలో ఉన్న రోజువారీ కూలీలకు, మైనర్ వర్కర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. వారికి భారీ కానుక ఇచ్చేనందుకు సిద్ధం అయ్యింది. వీరిని కూడా స్కీమ్ లో చేర్చనున్నారు. పెన్షన్ ప్లాన్ కవరేజ్‌ను పెంచాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. 60 ఏళ్ల దాటిన తర్వాత అసంఘటిత రంగంలో ఉన్న వాళ్లకి నెలకి మూడు వేలుని ఈ స్కీమ్ అమలులోకి వస్తే ఇవ్వడం జరుగుతుంది.

ఈ ప్రతిపాదిత స్కీమ్‌ను యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ పేరుతో ప్రకటించారు. రిటైర్‌మెంట్ పెన్షన్, వింతతు పెన్షన్, పిల్లల పెన్షన్, దివ్యాంగుల పెన్షన్‌కు ప్రత్యేక ప్రొవిజన్లు ఈ ప్రతిపాదిత స్కీమ్‌ లో వున్నాయి. అయితే దీన్ని పొందాలంటే సర్వీసు కనీసం అర్హత వ్యవధిని 10 ఏళ్ల నుంచి 15 ఏళ్లకు పెంచుతుంది.

60 ఏళ్లకి ముందే చనిపోతే కుటుంబ సభ్యులకి ఇస్తారు. దీనిలో కనుక డబ్బులు పొందాలంటే రూ.5.4 లక్షలను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు నెలకు రూ.3 వేలు ఇస్తారు. వచ్చే పెన్షన్ చెల్లించే దాని బట్టి ఉంటుంది. నెలకు రూ.15 వేలు సంపాదించే వారందరూ ఈపీఎఫ్ఓ లో డబ్బులు చెల్లించచ్చు.

అలానే దీపావళి కంటే ముందే పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పనున్నారు. ప్రైవేట్ రంగ ఉద్యోగులకు దీపావళి కంటే ముందే ఈపీఎఫ్ఓ వడ్డీలను క్రెడిట్ చేయనున్నారు. ఖాతాదారుల అకౌంట్లలోకి 8.1 శాతం వడ్డీ రేటు అక్టోబర్ చివరికి క్రెడిట్ అవుంటాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version