కొంతమంది నాయకులు, పెద్దలు… రెండు రాష్ట్రాల డీజీపీల వద్ద అనుమతులు తీసుకుని, ఏపీ నుంచి తెలంగాణకు, తెలంగాణ నుంచి ఏపీకి వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అవకాశం ఉండి కూడా చంద్రబాబు ఏపీకి రాకుండా… హైదరాబాద్ లో కట్టుకున్న ఇంద్రభవనంలో కరోనా హాలిడేను ఎంజాయ్ చేస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. దీనికి తగ్గట్లుగానే బాబు ప్రవర్తిస్తున్నారనే కామెంట్లూ వినిపిస్తున్నాయి! ఇంతకూ చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ వెళ్లడానికి అనుమతులు లేవా లేక.. ఆసక్తి లేదా? దానికి కారణం కరోనా భయమా లేక రిస్క్ ఎందుకు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందనే నిర్లక్ష్యమా?
వివరాళ్లోకి వెళ్తే… చంద్రబాబు ఈ సమయంలో హైదరాబాద్ లో ఉండటానికి అంతా అనుకున్నవి రెండు కారణాలు! ఒకటి… ఆదివారం ఒక్కరోజే కదా జనతాకర్ఫ్యూ అని అనుకోకుండా హైదరాబాద్ వెళ్లి ఇరుక్కుపోయారని కాగా… రెండొవది, ఏపీకి వద్దామని ఉన్నా, ఏపీకి వచ్చి ప్రజలకు మరింత ధైర్యం చెబుదామని అనిపించినా… ఏపీ మంత్రులు క్వారంటైన్ లో పెడతారని చెప్పడం వల్ల హైదరాబాద్ లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి అని! అయితే… ఈ రెండు విషయాలు అసత్యాలే అని తాజాగా తెలుస్తోంది. ఎందుకంటే… తాజాగా జరిగిన ఒక టీవీ డిబేట్ లో టీడీపీ నేతలు చేసిన కామెంట్లే దీనికి సాక్ష్యం!
ఇప్పటివరకూ ఏపీ వస్తాను, అనుమతించండని… ఇటు ప్రభుత్వానికి కాని, సీఎంఓ కు కానీ, డీజీపీ కి కానీ బాబు ఒక్క లేకైనా రాసిన దాఖలాలు లేవు! అసలు ఆయనకి ఈ కరోనా సంగతి ముగిసే వరకూ హైదరాబాద్ లోనే సేఫ్ గా ఉండాలని అన్న ఆలోచన… టైం పాసవ్వని పక్షంలో కాసేపు వీడియో కాంఫరెన్స్… అనంతరం కాసేపు జగన్ ప్రభుత్వంపై విమర్శలు అంతే! అంతేకానీ… నిజంగా ఏపీకి వచ్చి ప్రజలకు అందుబాటులో ఉండాలని… పోనీ కనీసం విజయవాడలోని కరకట్ట ఇంటికి కాకపోయినా… తాను కనిపించలేదని ఏకంగా పోలీస్ స్టేషన్లలోనే కంప్లైట్స్ చేస్తున్న సొంత నియోజకవర్గం కుప్పానికైనా బాబు వెళ్ల ఆలోచన చేయడం లేదు!
తాజాగా ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం ఇండైరెక్టుగా బాబుకు అనుమతి ఇచ్చినట్లే మాట్లాడుతున్నా… అసలు బాబు ఆ ఊసే ఎత్తడం లేదు. పైగా ఈ విషయం డిబేట్ లో మాట్లాడిన టీడీపీ నేత బండారు సత్యనారాయణ అయితే… చంద్రబాబు ఏపీకి రావడం కాదు, జగన్ నే కర్నూలు కు వెళ్లి రమ్మనండి అంటూ ఏమాత్రం అర్ధం లేని అడ్డగోలు వాదన చేయడం మొదలుపెట్టారు. ఈ లెక్కన చూసుకుంటే… ఏపీలోకి వెళ్తే క్వారంటైన్ లో పెడతారని ఏపీ మంత్రులు బెదిరిస్తున్నారనేది బాబుకు దొరికిన ఒక సాకు మాత్రమే… నిజంగా చెప్పాలంటే ఈ పరిస్థితుల్లో తాను మాత్రం సేఫ్ జోన్ లోనే హైదరాబాద్ లోనే ఫ్యామిలీతో ప్రశాంతంగా గడాపాలనే బాబు నిర్ణయించుకున్నారని స్పష్టమవుతుంది. సో… ఏపీకి బాబు ఇప్పట్లో రారు!! ఫిక్స్!!