లేవగానే మీ ముఖాన్ని మీరు అద్దంలో చూసుకుంటారా…? అయితే ఈ సమస్యలు తప్పవు…!

-

ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉంటుంది. నిద్రలేవ గానే వాళ్లకి నచ్చినట్లుగా వాళ్ళు అనుసరిస్తారు. కొందరు అయితే లేవ గానే భూదేవికి నమస్కారం చేస్తూ ఉంటారు. మరికొందరు వాళ్ళ ఇష్టదైవం ఫోటోకి నమస్కారం చేస్తారు. కొందరు అయితే వాళ్ల దగ్గర ఉన్న ఉంగరాన్ని లేదు అంటే గొలుసు లో ఉంటే దేవుడి లాకెట్ ను తీసి దండం పెట్టుకుంటారు.

 

ఇలా ఎవరి పద్ధతి వాళ్లది. అలానే క్రైస్తవులు యేసు దేవుడికి ప్రార్థన చేయడం, ముస్లింలు మసీదుకు వెళ్ళి నమాజ్ చదువు కోవడం, హిందువులు ఇంట్లో పూజలు చేయడం లేదు దేవాలయానికి వెళ్ళడం… ఇలా ఎవరికి నచ్చిన రీతిలో వాళ్లు ఉదయం లేవగానే ఆచరిస్తూ ఉంటారు.

అలాగే కొందరు లేవ గానే వాళ్ళ ముఖాన్ని వాళ్ళు అద్దం లో చూసుకుంటూ ఉంటారు. అద్దం లో ముఖాన్ని చూసుకోవడం, చుట్టు పక్కల ఉన్న వస్తువులను చూడడం ఎంత మాత్రం మంచిది కాదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

అద్దం లో వాళ్ళ ముఖాన్ని వాళ్ళే చూసుకుంటే తలపెట్టె కార్యక్రమాల్లో ఆటంకాలు వస్తాయని అలాగే శుభ కార్యక్రమం నిర్వహించిన దానికి విరుద్ధంగా సమస్యలు ఏర్పడతాయని అంటున్నారు పండితులు. అలానే ఉదయం లేవగానే పెరుగు, ఆవాలు, అద్దాలు వంటివి చూడకూడదని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news