డొక్కు స్కూటర్ మీద తిరిగిన కేసీఆర్ కు ఇంత ఆస్తి ఎక్కడ నుండి వచ్చింది – ఎంపీ లక్ష్మణ్

-

డొక్కు స్కూటర్ మీద తిరిగిన కేసీఆర్ కు ఇంత ఆస్తి ఎక్కడ నుంచి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు బిజెపి రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్. మునుగోడు ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్.. కోటా శ్రీనివాసరావును మించిన నటుడంటూ ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ కు వేల కోట్ల రూపాయల ఆస్తి ఎలా వచ్చిందో చెప్పాలన్నారు. టిఆర్ఎస్ నేతలు ఎన్ని కుట్రలు చేసినా మునుగోడులో బిజెపి విజయాన్ని ఆపలేరని అన్నారు.

కేవలం మునుగోడు ఉప ఎన్నిక కోసమే ఎస్టీల రిజర్వేషన్ పెంచారని విమర్శించారు. రైతు రుణమాఫీ పేరుతో ఓట్లు దండుకున్న కేసీఆర్.. ఆ హామీని ఎప్పుడు నెరవేరుస్తారో చెప్పాలన్నారు. ఎర్రవల్లిలో 100 ఇండ్లు కట్టి ఎనిమిది ఏళ్లుగా అవే చూపిస్తున్నారని విమర్శించారు. రైతు ఆత్మహత్యలలో తెలంగాణ దేశంలోనే నాలుగవ స్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్నిక తెలంగాణ ఆత్మగౌరవానికి, కల్వకుంట్ల కుటుంబానికి మధ్య జరుగుతున్న ఎన్నిక అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version