ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యారు. ఈ తరుణంలో… ఎన్నికల ముందు రాష్ట్రంలో ఈడీ దాడులు చేయడంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికలు జరుగుతుంటే అక్కడికి ముందుగా ఈడీ వస్తుందని, ఆ తర్వాత నరేంద్ర మోడీ వస్తారంటూ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్రానికి ఈరోజు మధ్యాహ్నం ఎమ్మెల్సీ కవిత ఇంటికి ఈడీ వస్తే.. సాయంత్రం మోదీ వచ్చారంటూ సెటైర్లు వేస్తున్నారు. కాగా, ‘వెల్కమ్ మోదీ.. థ్యాంక్యూ ఈడీ’ అని బీజేపీ నేతలు ట్వీట్స్ చేస్తున్నారు.
కాగా,ఇవాళ ఢిల్లీ నుండి వచ్చిన ఐటీ, ఈడీ అధికారుల బృందం హైదరాబాద్లోని ఆమె ఇంట్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. దాదాపు 4 గంటల పాటు అధికారులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని విచారించారు. అనంతరం కోర్టు అనుమతితో కవితకు ఈడీ అధికారులు అరెస్ట్ నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు.