కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారు.. ప్రతిపక్షాలపై మల్లు రవి ఫైర్..!

-

కాంగ్రెస్ సర్కార్ కూలిపోతుందన్న బీఆర్ఎస్, బీజేపీ నేతల వ్యాఖ్యలపై కాంగ్రెస్ మాజీ ఎంపీ మల్లు రవి ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రతిపక్షాలు బీఆర్ఎస్, బీజేపీ గౌరవించడం లేదని.. ప్రజా ఆమోదంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి అభ్యర్థులు లేకే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులను చేర్చకుంటున్నారని అన్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా తొలి అప్లికేషన్ తనదేనని చెప్పారు. టికెట్ ఎవరికి ఇవ్వాలనేదే అధిష్టానమే నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు.  కాంగ్రెస్ నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ హాట్ సీటుగా మారింది.

నాగర్ కర్నూల్ టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీలోని ఇద్దరు కీలక నేతలు పోటీ పడుతున్నారు. మల్లు రవి, సంపత్ కుమార్ టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. నాగర్ కర్నూల్ టికెట్ కోసం మల్లు రవి ఢిల్లీ అధికార ప్రభుత్వ ప్రతినిధి పదవికి సైతం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కీలక
నేతలు టికెట్ కోసం పోటీ ఇద్దరూ పడుతుండటంతో టీపీసీసీ, ఏఐసీసీకి నాగర్ కర్నూల్ అభ్యర్థి ఎంపిక సవాల్గా మారింది. ఇటీవల ఐదుగురితో టీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ను ఏఐసీసీ విడుదల చేసింది. ఇందులో నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి పేరు ప్రకటించకుండా అధిష్టానం హోల్డ్లో పెట్టింది. ఈ క్రమంలో నాగర్ కర్నూల్ కాంగ్రెస్ టికెట్ ఎవరికి దక్కుతుందోనని తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version