టీ బ్యాగులని ఇలా తయారు చేసారా..? దాని వెనుక కథ ఇదే..!

-

ప్రయాణం లో టీ బ్యాగ్లని ఉపయోగించడం ఈజీగా ఉంటుంది అలానే ఒక్కొక్క సారి మనకి పనులు ఏమైనా ఉన్నప్పుడు ఈజీగా టీ తయారు చేసుకోవడానికి టీ బ్యాగులు మనకి బాగా ఉపయోగపడతాయి. టీ పొడి వేసుకుని టీ చేయడం ఇదంతా కూడా ఒక పెద్ద ప్రాసెస్ అలా కాకుండా ఈజీగా మనం టీ బ్యాగ్ ని పాలల్లో డిప్ చేసేసి టీ ని తయారు చేసుకోవచ్చు అయితే అసలు టీ బ్యాగులు ఎలా వచ్చాయి…? టీ బ్యాగులను ఎప్పుడు తీసుకు వచ్చారు టీ బ్యాగుల వెనక కథ ఏమిటి అనే విషయాలను ఇప్పుడు చూసేద్దాం.

థామస్ సుల్లివన్ అనే ఒక ఆయన టీ వ్యాపారి కొడుకు. ఆయన తన తండ్రి వారసత్వంగా వచ్చిన వ్యాపారాన్ని మొదలుపెట్టారు. ఆయనకి ఒక ఐడియా వచ్చి కొంచెం టీ పొడిని చిన్న పట్టు పౌచుల్లో ప్యాక్ చేసి టీ పొడి రుచి చూడమని వినియోగదారులకి పంపించాడు. అయితే ఆ పౌచ్లని తీసుకున్న వినియోగదారులు ఆ టీ బ్యాగ్ ని ఎలా ఉపయోగించాలో తెలియక కప్పు వేడి నీటి లో ఆ పౌచ్ ని వేశారు.

ఇంకేముంది ఈజీగా టీ తయారై పోయింది అప్పుడు ఆయనకి ఆర్డర్లు విపరీతంగా వచ్చాయి. అలాంటి పౌచులు కావాలని వినియోగదారులు ఆర్డర్లు చేయడం మొదలు పెట్టారు ఇలా థామస్ మొదటి సారి టీ బ్యాగ్స్ ని విక్రయించడం ప్రారంభించారు ఇది చాలా పెద్ద బిజినెస్ గా మారిపోయింది. టీ బ్యాగ్స్ కి ఇద్దరు మహిళలు పేటెంట్ పొందారు కానీ థామస్ మాత్రం పేటెంట్ ని పొందలేదు చరిత్ర లో ఆయన మిగిలిపోయారు ఇప్పుడు మనం ఉపయోగించే టీ బ్యాగులు వెనక ఇంత పెద్ద కథ ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version