తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ ఎనిమిదో వారం చాలా ఆసక్తికరంగా సాగుతోంది. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనేది చర్చనీయాంశంగా ఉంది. ఇక శనివారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇంటి సభ్యుల్లో బెస్ట్ కంటెస్టెంట్ ఎవరనేది తేలింది. బెస్ట్ ఇంటి సభ్యుడిని సెలక్ట్ చేసి తగిన కారణాలివ్వాలని ‘బిగ్ బాస్’ సూచించారు. దాంతో కంటెస్టెంట్స్ తగు కారణాలతో బెస్ట్ సభ్యులను సూచించారు.
మిత్రాశర్మ బెస్ట్ ఇంటి సభ్యురాలు అని అఖిల్ పేర్కొన్నాడు. మిత్ర గేమ్ చాలా బాగా ఆడుతున్నదని చెప్పాడు. ఇంటి సభ్యుల్లో బెస్ట్ ఎవరనేది బిందు మాధవి కొంచెం ట్విస్టెడ్ గా చెప్పింది. అరియానా కాని హమీద కాని అని తెలిపింది. అంటే ఎవరు పోటీ పడితే వారికి ఓటు ఇచ్చేస్తానని అంది బిందు. అలా చివరకు ఓటు హమీదకు పడింది. హమీద బెస్ట్ సభ్యురాలు అని పేర్కొన్న అనిల్..హమీదకు ఓటేస్తాడు. అజయ్..శివకు బెస్ట్ సభ్యుడని ఓటేస్తాడు. కెప్టెన్ అయినప్పటికీ గేమ్ పట్ల ఫోకస్ చేశాడని చెప్తాడు అజయ్.
ఇక బాబా మాస్టర్ ఓటేయడంలోనూ ట్విస్టు ఇచ్చి మరీ ఓటేశాడు. గర్ల్స్ బాగా ఆడారని చెప్పి..చివరకు హమీదకు ఓటేశాడు. అషురెడ్డి..బిందు మాదవి బెస్ట్ ప్లేయర్ అని చెప్పగా, అరియానా..హమీద బెస్ట్ ప్లేయర్ అని అంటుంది. శివ అందరూ అనుకున్నట్లుగానే బిందు మాధవికి బెస్ట్ ప్లేయర్ అని చెప్పాడు.
కానీ, గత వారం కొంచెం మంచిగా ఆడిందని చెప్పాడు. అలా ట్విస్ట్ చేసి మరి బెస్ట్ అనే ట్యాగ్ ఇచ్చేశాడు. ఇక హమీదనే చివరకు బెస్ట్ ఇంటి సభ్యురాలిగా సెలక్ట్ అయింది. ఈ నేపథ్యంలోనే ఆమెను ఎట్టి పరిస్థితుల్లో ఎలిమినేట్ చేయబోరని బీబీ లవర్స్ చర్చించుకుంటున్నారు. చూడాలి మరి..ఏం జరుగుతుందో…ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో..