క‌రోనా వ్యాక్సిన్ వ‌స్తే ఎవ‌రికి ప్రాధాన్యం..?

-

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేస్తుంది. ఇదిగో వ్యాక్సిన్ అదిగో వ్యాక్సిన్ అంటూ వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. ర‌ష్యా వ్యాక్సిన్ త‌యారు చేసింది కూడా. ఇక టీకా త‌యారు చేసినా కూడా ఆ వ్యాక్సిన్ ప్ర‌భావం ఎంత‌వ‌ర‌కు ఉంటుంద‌నేది మ‌రో ప్ర‌శ్న‌. క‌రోనా అంతం కావాలంటే ఒక‌టి వ్యాక్సిన్ కాగా రెండో మార్గం సామాజిక వ్యాప్తి జ‌ర‌గ‌టం. సామాజిక వ్యాప్తి వ‌ల్ల జనాభాలో ఒక నిర్దిష్ట స్థాయి వైరస్ వచ్చిన తర్వాత సహజంగానే ఎక్కువ‌మందికి రోగనిరోధక శక్తి ఏర్పడుతుంది. రోగ‌నిరోధ‌క శ‌క్తి పెర‌గ‌టం, ఆరోగ్య సూత్రాలు పాటించ‌డం వ‌ల్ల రానున్న రోజుల్లో ఈ వైర‌స్ అంత‌మయ్యే అవ‌కాశాలు ఉన్నాయి.

ఇంకా వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావ‌డానికి స‌మ‌యం ప‌డుతుంది. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ వ‌రకు రావ‌చ్చ‌నేది అంచ‌నా. నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అల‌ర్జీ అండ్ ఇన్‌ఫెక్షియ‌స్ డిసీజెస్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ ఆంథోనీ ఫాసి మాట్లాడుతూ.. 70 -75 శాతం ప్రభావవంతమైన వ్యాక్సిన్ తీసుకుంటే మనం అదృష్టవంతులుగా భావించాలని అన్నారు.

కరోనా వైరస్ వ్యాక్సిన్ గనుక ముందు మన దేశంలోకి వస్తే మాత్రం ముందు ఎవరికి వాడాలి…? ఈ ప్రశ్న చాలా వరకు కూడా వేధిస్తుంది. భారత్ కి ఉన్న పరిస్థితులు చాలా వేరుగా ఉంటాయి. జనాభా ఎక్కువగా ఉన్న నేపధ్యంలో ఇప్పుడు అప్రమత్తంగా వ్యాక్సిన్ ని వినియోగించాలి. క‌రోనా వ్యాక్సిన్ ప్ర‌జా పంపిణీకి సిద్ధం అయితే దాన్ని ముందుగా ఎవ‌రికిస్తారు ? అత్య‌వ‌స‌ర సేవ‌ల‌ను అందించే సిబ్బందికా ? అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారికా ? వృద్ధులు, పిల్ల‌ల‌కా ? లేదా పేద‌ల‌కా ? అన్న విష‌యంపై ప్ర‌స్తుతం కేంద్ర ప్ర‌భుత్వం మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంది. అయితే మన దేశంలో ముందు కరోనా వ్యాక్సిన్ ఎవరికి ఇవ్వాలి ఏంటీ అనేది ఒకసారి గనుక చూసినట్లు అయితే…

పోలీసులు, మునిసిపల్ ఉద్యోగులు మరియు వైద్య సిబ్బంది మరియు వైద్యులు వంటి ఫ్రంట్‌లైన్ కార్మికులకు టీకాలు వేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలి అనేది నిపుణులు చెప్తున్నారు. వారు ఆరోగ్యంగా ఉండటం సమాజానికి చాలా అవసరం. అదేవిధంగా, వృద్ధులకు వైరస్ నుండి ఎక్కువ ప్రమాదం ఉన్నందున వారికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు. కానీ పరీక్షల్లో వృద్ధులకు వ్యాక్సిన్‌ ఇచ్చే సమయంలో జాగ్రత్తగా చూసుకోవాలి.

ఒక ప్రాంతంలో ఎక్కువ మందికి టీకాలు వేయాల్సి ఉంటుంది. గుంపులుగా జనాలు నివసించే ప్రాంతంలో టీకాలు వేయడం అనేది చాలా అవసరం. ప్రతీ ఒక్కరికి కూడా వ్యాక్సిన్ వేయడం అనేది సాధ్యం కాదు కాబట్టి, సూపర్ స్పైడర్ లు తయారు అయ్యే ప్రాంతాల్లో వ్యాక్సిన్ వేయడం అనేది చాలా అవసరం అని నిపుణులు వెల్లడిస్తున్నారు. గర్భిణీ స్త్రీలకు కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వాలి అని హెచ్చరిస్తున్నారు. మన దేశ జనాభా గ్రామాల్లోనే ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

వ్యాక్సిన్ నేష‌న‌లిజ‌మ్ అత్యంత ప్ర‌మాద‌క‌రంగా మారుతుంద‌ని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చ‌రించింది. వ్యాక్సిన్ ప్ర‌పంచానికి అవ‌స‌రం కాబ‌ట్టి అన్ని దేశాల‌కు ఉప‌యోగ‌ప‌డేలా ఉండాలని, WHO చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ అన్నారు. వ్యాక్సిన్ ఉత్ప‌త్తికి కావాల్సిన సామాగ్రిని ప్ర‌ణాళికా బ‌ద్దంగా మరియు ప్రపంచవ్యాప్తంగా పంచుకోవడం ప్రతి దేశం యొక్క జాతీయ ప్రయోజనం అంటూ పేర్కొన్నారు.

ప్ర‌భుత్వాలు తీసుకుంటున్న చ‌ర్య‌ల మూలంగా క‌రోనా క‌ట్ట‌డి అయినా.. కేసుల సంఖ్య ఏదో ఒక ద‌శ‌లో సున్నా అయినా.. కరోనా ప్ర‌భావం కొంత కాలం వ‌ర‌కు తగ్గినా.. వైర‌స్ మ‌ళ్లీ దాడి చేస్తే.. అప్పుడు ఇంకా తీవ్ర‌మైన ప‌రిణామాలు ఏర్పడుతాయ‌ని సైంటిస్టులు అంటున్నారు. క‌నుక ప్ర‌భుత్వాల ముందు ఇప్పుడున్న ఏకైక మార్గం.. ఎట్టిప‌రిస్థితిలోనైనా స‌రే.. వ్యాక్సిన్ ను క‌చ్చితంగా త‌యారు చేయాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version