దర్శకధీరుడు రాజమౌళి సినిమాలకు కొదవ లేదు. రాజమౌళి సినీ ప్రఖ్యాత గురించి తెలియని వారుండరు. ఇంటస్ట్రీలో ఆయనతో పోటీ పడడం ఏ మాత్రం సులువు కాదు. స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో దర్శకుడిగా మారిన రాజమౌళి ఆ తర్వాత ఎన్నో సూపర్ డూపర్ హీట్ సినిమాలకు అందించారు. 15 ఏళ్ల కెరియర్‌లో ఎన్నో సినిమాలు తీసిన తర్వాత బాహుబలి సినిమాతో ఆయనకు మరింత తిరుగులేని క్రేజ్ ఏర్పడింది.
వాస్తవానికి తెలుగు పరిశ్రమ గొప్పతనాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసిన డైరక్టర్ రాజమౌళి గ్రేటనే చెప్పాలి. ఆయన కెరీయర్‌లో అన్ని సినిమాలు ఒక ఎత్తైతే.. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృషించిన బాహుబలి మాత్రం ఒక ఎత్తు. కానీ.. ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కబోయే `సాహో` డైరెక్టర్ సుజిత్‌కు క్రెడిట్ దక్కడానికి ఎంతో సమయం పట్టలేదు.
రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ `రన్ రాజా రన్` వంటి చిన్న చిత్రానికి దర్శకత్వం వహించిన సుజిత్ రెండేళ్లకే పాన్ ఇండియా మూవీ తీయడం అంటే మామూలు విషయం కాదు. 24 ఏళ్లకే సుజిత్ భారీ ఫ్యాన్ ఫాలోంగ్ ఉన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో భారీ యాక్షన్ థిల్లర్ `సాహో` చేసే అదృష్టాన్ని దక్కించుకున్నాడు.
ఈ క్రమంలోనే సాహో క్రేజ్‌తో సుజిత్‌కు భారీగా ప్రశంసలు అందుతున్నాయి. ఆ క్రమంలోనే కొందరు రాజమౌళి గొప్పంటే మరికొందరు సుజిత్ గొప్పంటున్నారు. వాస్తవానికి ఎవరినీ తక్కువ చేయలేమనే చెప్పాలి.