హిందీ లో పుష్ప‌క విమానం : హీరో ఎవ‌రంటే ?

-

రౌడీ హీరో విజ‌య్ దేవ‌రకొండ త‌మ్ముడు ఆనంద్ దేవ‌రకొండ హీరో గా ఇటీవ‌ల వ‌చ్చిన సినిమా పుష్ప‌క విమానం. ఈ సినిమా ఇటీవ‌లే న‌వంబ‌ర్ 12 న‌ థీయేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌స్తుంది. దీంతో ఈ సినిమా రైట్స్ కోసం బాలీవుడ్ నిర్మాణ సంస్థ‌లు పోటీప‌డుతున్న‌ట్టు తెలుస్తుంది. ఈ సినిమా రైట్స్ కోసం మూడు బాలీవుడ్ నిర్మాణ సంస్థ లు పోటీ ప‌డుతున్నాయని స‌మాచారం. ఈ విషయాన్ని ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూస‌ర్ అనురాగ్ ప‌ర్వ‌త‌నేని తెలిపారు. ఈ సినిమా క్వాలిటీ కారణంగా నే ఈ సినిమా కు ఇంత డిమాండ్ వ‌స్తుంద‌ని అన్నారు.

అయితే ఈ మూడు బాలీవుడ్ నిర్మాణ సంస్థ లు పుష్ప‌క విమానం చిత్ర యూనిట్ తో చ‌ర్చి స్తున్నార‌ని తెలిపారు. త్వ‌ర‌లో నే ఈ సినిమా బాలీవుడ్ లో ప‌ట్టాలు ఎక్క‌నుంద‌ని చెప్పారు. అయితే ఈ సినిమా హింది రిమేక్ లో ఆయూష్మాన్ ఖురానా లేదా విక్కి కౌశ‌ల్ హీరో గా న‌టించే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. అయితే ఈ సినిమా లో అమాయకంగా ఉండేలా హీరో పాత్ర ఉంటుంది. కాబ‌ట్టి ఈ ఇద్ద‌రి ల‌లో ఒక్క‌రని హీరో గా సెల‌క్ట్ చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news