బీసీసీఐ కొత్త సెలక్టర్ ఎవరంటే…?

-

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ కి ఎమ్మెస్కే ప్రసాద్ స్థానంలో కొత్త సెలెక్టర్ వచ్చారు. ఆయన స్థానంలో సునీల్ జోషి ని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు ముంబైలో చీఫ్ సెలక్టర్ జాబ్ కోసం మదన్ లాల్, ఆర్పీ సింగ్, సులక్షణ నాయక్‌ లతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించగా… అందులో సునీల్ జోషి, వెంకటేష్ ప్రసాద్, టీమిండియా మాజీ స్పిన్నర్ ఎల్ఎస్ శివరామకృష్ణన్, రాజేష్ చౌహాన్‌తో పాటుగా,

మీడియం పేసర్ హర్వీందర్ సింగ్‌ను కూడా ఇంటర్వ్యూకు పిలిచింది కమిటి. చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, సెలక్షన్ కమిటీ సభ్యుడు గగన్ ఖోడా పదవీ కాలం ముగిసిపోతున్న నేపధ్యంలో… ఆ రెండు పోస్టులకు దరఖాస్తులను బోర్డ్ ఆహ్వానించింది. దీనికి మొత్తం 44 దరఖాస్తులు రాగా… వారిలో పేసర్ అజిత్ అగార్కర్, మాజీ వికెట్ కీపర్ నయన్ మోంగియా కూడా ఉన్నారు.

అజిత్ అగార్కర్ పేరు దాదాపు ఖరారైందని అంతా భావించిన తరుణంలో… కర్ణాటకకు చెందిన సునీల్ జోషి చీఫ్ సెలక్టర్‌గా ఎంపికయ్యారు. సునీల్ జోషీ ఎడమచేతి వాటం స్పిన్నర్. 1996 నుంచి 2001 మధ్య భారత జట్టు తరఫున టెస్టులు, వన్డేల్లో ఆడారు. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్, అనిల్ కుంబ్లేకు సపోర్ట్ గా ఉండే వారు. హైదరాబాద్ క్రికెట్ జట్టు, తాజాగా జమ్మూకాశ్మీర్ క్రికెట్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version