AP:రేపటి నుంచి నూతన ఇసుక విధానం ప్రారంభము

-

సోమవారం నుంచి జిల్లావ్యాప్తంగా ఇసుక ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ,ఇసుక కావాల్సిన వారు కేవలం రవాణా ఖర్చులు మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని కలెక్టర్ సృజన వెల్లడించారు.

జిల్లావ్యాప్తంగా ఎనిమిది స్టాక్ పాయింట్లలో 5లక్షల మెట్రిక్ టన్నుల లభ్యత ఉందని ,ఇసుక కావాల్సిన వారు ఆధార్ కార్డుతోపాటు, దిగుమతి చేసుకునే చిరునామా వివరాలు అందించాలనితెలిపారు. ఎవరైనా అక్రమంగా డంపింగ్ చేసినా, ఇతర ప్రాంతాలకు తరలించినా కఠిన చర్యలు ఉంటాయనివార్నింగ్ ఇచ్చారు. ఉచిత ఇసుక విధానం ద్వారా రాష్ట్రంలో భవన నిర్మాణ రంగం వేగం పుంజుకుంటుందని తెలిపారు. ఏపీలో 2014 చంద్రబాబు ప్రభుత్వంలో ఇసుక ఉచితంగా పంపిణీ చేసేవారు. 2019ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత ఆ విధానం తీసివేయడంతో ఇసుక లభ్యత కొరవై రాష్ట్రంలో భవన నిర్మాణ రంగం పూర్తిగా కుంటుపడింది. ఆ రంగంపై ఆధారపడిన కార్మికులు ఉపాధి ఒకసారి కరువయ్యాయి. అప్పటి జగన్ ప్రభుత్వ వైఖరిపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. రాష్ట్రంలో ఇసుక రవాణా చేసి కార్మికులను ఆదుకోవాలంటూ ఆందోళనలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version