సాయిథరమ్ తేజ్ ట్వీట్… సీఎం రేవంత్ రెడ్డి రిప్లై

-

యంగ్ హీరో సాయిథరమ్ తేజ్ తల్లిదండ్రులను హెచ్చరిస్తూ ..సోషల్ మీడియాలో జరుగుతున్న దారుణాలపై పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.చిన్నపిల్లల ఫోటోలు,వీడియోలు పోస్ట్ చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఫన్నీ పేరుతో చిన్నపిల్లలను ట్రోల్ చేస్తున్న వీడియోను తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు హీరో సాయిధరమ్ తేజ్. కొంతమంది యూట్యూబర్స్ ఓ తండ్రి తన కూతురి వీడియోను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడారు. దీనికి సంబంధించి కామెంట్స్ ను ఉద్దేశిస్తూ ..ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులతో పాటు..డిప్యూటీ సీఎంలను, డీజీపీలకు, పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

ఈ ట్వీట్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. పిల్లల జాగ్రత్తపై సూచనలు చేసిన సాయిథరమ్ తేజ్ కు కృతజ్ఞతలు తెలిపారు.సమస్యను తమ దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. తమ ప్రభుత్వం పిల్లల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని , ఈ ఘటనను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version