కే కే స్థానంలో రాజ్యసభకు వెళ్ళేది ఆయనేనా

-

బీఆర్ఎస్ వదిలి కాంగ్రెస్ గూటికి చేరిన కేశవరావుకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. మరి ఆయన రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ సీటును ఎవరికిస్తారు..? తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకిస్తారా…? లేదంటే సీనియర్లకు కేటాయిస్తారా..? అసలు హైకమాండ్‌ ఆలోచనేంటి..? అన్నదీ ఆసక్తికరంగా మారింది.బీఆర్ఎస్ నుంచి రాజ్యసభ ఎంపీగా నామినేట్‌ అయిన కేకే… ఇటీవలె కాంగ్రెస్‌లో చేరారు. ఒకపార్టీ నుంచి పదవి పొంది మరో పార్టీలో చేరినప్పుడు రాజీనామా చేయడం నైతిక బాధ్యతగా భావిస్తూ… ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన ఒక్కరోజులోనే అమోదం లభించింది. దీంతో ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ఆయనకు కీలక పదవి కట్టబెట్టింది కాంగ్రెస్‌ ప్రభుత్వం.

రాజ్యసభ సభ్యత్వానికి కే కే రాజీనామా చేయడంతో ఆ సీటు ఎవరికి ఇస్తారన్నది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. తెలంగాణకు చెందిన వ్యక్తి కావడంతో ఇక్కడ వాళ్లకే సీటు ఇస్తారన్న వాదనలు వినిపించాయి. కానీ ఆ సీటును పార్టీలోని కీలక నేతకు ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచన చేస్తుంది. ఏఐసీసీ అధికార ప్రతినిధి, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ అభిషేక్‌ మను సింఘ్వీకి ఆ సీటు ఇవ్వడం ఖాయమంటూ తెగ ప్రచారం జరుగుతోంది. పార్టీ హైకమాండ్ ఆయనకు దాదాపుగా గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చినట్టు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. ఇటీవల హిమాచల్‌ప్రదేశ్‌లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి జరిగిన ఎన్నికలో అభిషేక్ సింఘ్వీ అనుకోకుండా ఓటమి పాలయ్యారు. దీంతో ఆయనను మరో చోట నుంచి పెద్దల సభకు పంపాలని కాంగ్రెస్‌ హైకమాండ్‌ భావిస్తోంది

బీఆర్ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఆయనను ప్రభుత్వ సలహాదారుడిగా నియమిస్తూ… ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ప‌బ్లిక్ అఫైర్స్ స‌ల‌హాదారుగానూ ఆయ‌న కొన‌సాగ‌నున్నారు. అలాగే కేకేకు కేబినెట్ హోదా కూడా క‌ల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాంగ్రెస్ లో చేరగానే కేశవరావు కు పదవి దక్కడంతో ఆయన కంటే ముందు జంప్ అయిన ఎమ్మెల్యేలు పెదవి విరుస్తున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఎలాంటి పదవులు ఉండబోవని కాంగ్రెస్ హైకమాండ్ తేల్చిచెప్పినా కేశవరావు కి కేబినెట్ హోదాతో కూడిన పదవి ఇవ్వడంతో ఆయానకొక న్యాయం ఇతరులకు ఓ న్యాయమా అని అసంతృప్తితో రగిలిపోతున్నారు.మరి ఆశావహులకు సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి న్యాయం చేస్తారో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Exit mobile version