నిర్భయ దోషులను కాపాడుతుంది ఎవరు…?

-

2012 చివర్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్య కేసు నిందితులకు ఉరిశిక్ష అమలు అవుతుందా లేదా అనే దానిపై అనేక సందేహాలు నెలకొన్నాయి. ఇప్పటికే వాళ్లను ఉరితీయాలని కోర్టులు డెత్ వారెంట్ లు కూడా జారీ చేసినా కొన్ని అడ్డంకులు వల్ల ఉరి అమలు వాయిదా పడుతూ వస్తుంది. ఎట్టకేలకు ఫిబ్రవరి 1న ఉదయం ఆరు గంటలకు వాళ్ళను ఉరితీయాలని డెత్ వారెంట్ కూడా జారీ చేసిన నేపథ్యంలో అధికారులు ఉరి కోసం ఏర్పాట్లు కూడా చేశారు. అదే విధంగా ట్రయల్ ఉరి కూడా నిర్వహించారు.

ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఒక తలారి వాళ్ళని ఉరి తీయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదిలా ఉంటే అసలు ఇప్పుడు అమలు అవుతుందా లేదా అనే దానిపై అనేక సందేహాలు నెలకొన్నాయి. ఒకరి తర్వాత ఒకరు రాష్ట్రపతి, ఢిల్లీ హైకోర్టు, కేంద్రం, సుప్రీంకోర్టు అంటూ అటూ ఇటూ పిటీషన్లు దాఖలు చేస్తున్నారు. సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఉరిని ఎలాగైనా ఆపాలని వారు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఒకరి తర్వాత ఒకరు క్షమాభిక్ష పిటిషన్లు దాఖలు చేస్తూ వస్తున్నారు. దీనికి రాజకీయ అడ్డంకులు కూడా తోడైనట్లు సమాచారం. నిర్భయ తల్లి ఇప్పటికే రాజకీయాల మీద వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1న వాళ్ళని ఉరి తీస్తారా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక నిందితులు ఉరిని వాయిదా వేయడానికి గాను తమను తాము గాయపరచకునే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు.

దీనితో వాళ్లకు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా కలుసుకునే అవకాశం కల్పించారు. ఫిబ్రవరి 1న ఎలాగైనా ఉరి తీయాలని అధికారులు కూడా పట్టుదలగా ఉన్నట్టు సమాచారం. అయితే దీనిని అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు మళ్లీ వినయ్ శర్మ అనే నిందితుడు రాష్ట్రపతి దగ్గర తన క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నారు.

రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉంది. ఇప్పుడు రాష్ట్రపతి తిరస్కరించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మళ్లీ అక్కడ తిరస్కరిస్తే సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశం కూడా వాళ్లకు ఉంది. ఈ విధంగా చట్టాలను ఉపయోగించుకుని ఎలాగైనా సరే తమ ప్రాణాలను కాపాడుకునేందుకు తీవ్రం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నిందితులకు అసలు అంత ఆర్థిక స్తోమత లేదని లాయర్ల పెట్టుకొని వాదించే అవకాశం లేదని, దీని వెనుక రాజకీయాలు జరుగుతున్నాయని, ఉరిని ఆపడానికి రాజకీయ పార్టీలు వాళ్లకు అన్ని విధాలుగా సహకారం చేస్తున్నాయని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version