జాతిపిత మహాత్మా గాంధి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. తన నియోజకవర్గం కేరళలోని వాయనాడ్ లో పర్యటించిన ఆయన రాజ్యాంగ పరిరక్షణ పేరిట జరిగిన రెండు కిలోమీటర్ల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాహుల్… ప్రధాని మోడిని గాంధీజిని హతమార్చిన నాథూరాం గాడ్సేతో పోలుస్తూ సంచలన ఆరోపణలు చేసారు.
ప్రధాని మోడీది నాథూరామ్ గాడ్సే ఇద్దరిదీ ఒక్కటే సిద్ధాంతమని రాహుల్ వ్యాఖ్యానించారు. అయితే గాడ్సేపై తనకు విశ్వాసం ఉందని చెప్పే దమ్ము మాత్రమే ప్రధాని మోదీకి లేదని రాహుల్ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయంగా భారత ప్రతిష్ఠను తన విధాన నిర్ణయాలతో ప్రధాని మోదీ దెబ్బతీస్తున్నారని రాహుల్ దుమ్మెత్తి పోశారు. భారతీయులు తాము భారతీయులేనని నిరూపించుకోవాల్సిన దుస్థితిని ఏర్పరస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.
తాను భారతీయుడో? కాదో? నిర్ణయించడానికి ప్రధాని మోదీ ఎవరని రాహుల్ గాంధీ నిలదీశారు. ఎవరు భారతీయుడు? ఎవరు భారతీయుడు కాదో? నిర్ణయించేందుకు మోదీకి ఎవరు లైసెన్స్ ఇచ్చారని రాహుల్ నిలదీశారు. తాను భారతీయుడు అనే విషయం తనకు తెలుసు అని స్పష్టం చేసిన రాహుల్ గాంధి దీన్ని ఎవరి ముందూ నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదన్నారు.
#WATCH Rahul Gandhi, Congress in Kalpetta, Kerala: Nathuram Godse & Narendra Modi believe in the same ideology, there is no difference except Narendra Modi does not have the guts to say he believes in Godse. pic.twitter.com/J7GmOlBW55
— ANI (@ANI) January 30, 2020