మరో భయంకర వైరస్ వచ్చే అవకాశం ఉంది : డబ్ల్యూహెచ్‌వో

-

కరోనా కంటే అతి భయంకరమైన మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా కావాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి టెడ్రోస్ అధనామ్ హెచ్చరించారు. కొవిడ్-19 కంటే ప్రాణాంతకరమైన మరో మహమ్మారి రాబోతుందని హెచ్చరికలు జారీ చేశారు. కరోనా సంక్షోభం ఇంకా ముగిసిపోలేదని చెప్పుకొచ్చారు. సోమవారం జరిగిన 76వ ప్రపంచ ఆరోగ్య సభలో డబ్ల్యూహెచ్‌వో చీఫ్ ఈ విషయాన్ని చెప్పారు.

‘సరికొత్త వ్యాధులు, మరణాల పెరుగుదలకు కారణమయ్యే మరో వ్యాధికారక వేరియంట్ ఉద్భవించే ముప్పు ఉంది. ఇది కరోనా కంటే ప్రాణాంతకంగా ఉండొచ్చు’ అని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి, అన్ని రకాల అత్యవసర పరిస్థితులకు తక్షణమే ప్రతిస్పందించి, పరిష్కరించేలా ప్రభావవంతమైన అంతర్జాతీయ యంత్రాంగం అవసరమని నొక్కి చెప్పారు. మరో మహమ్మారి మన ప్రపంచం తలుపు తట్టినప్పుడు, దానికి నిర్ణయాత్మకంగా, సమిష్టిగా, సమానంగా సమాధానం ఇచ్చేలా ఆ యంత్రాంగం ఉండాలని సూచించారు. వ్యాక్సిన్ పంపిణీలో పేద దేశాల పట్ల వివక్ష చూపిన నేపథ్యంలో టెడ్రోస్ ఈ సూచన చేశారు. అలాగే, కరోనా మనల్ని దెబ్బతీసినప్పటికీ, ఆరోగ్య రంగానికి ఎన్నో పాఠాలు నేర్పిందని చెప్పారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version