WHO హెచ్చరిక : ఏ ఒక్క దేశంలో కూడా కరోనా అంతం అవ్వలేదు..!

-

క‌రోనా కారణంగా స్తంభించిన ఆర్థిక వ్య‌వ‌స్థ‌ ఇప్పుడిప్పుడే మెరుగుపడుతుంది. ఈ సందర్బంగా డ‌బ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ ఆంధమ్ మాట్లాడుతూ, ఆర్థిక వ్య‌వ‌స్థ పునః ప్రారంభాన్ని స్వాగ‌తిస్తున్నాం. కానీ క‌రోనా పూర్తిగా వెళ్లిపోయిన‌ట్లు కాదు. ఏ ఒక్క దేశంలో కూడా మ‌హ‌మ్మారి అంతం అవ్వలేదు. కరోనాని నియంత్రించ‌డంలో మ‌నం సీరియ‌స్‌గా ఉండాలి. క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్టేందుకు అన్ని దేశాలు సుర‌క్షిత‌మైన చ‌ర్య‌లు తీసుకోవాలి’ అని తెలిపారు.

అలాగే చాలా దేశాలు తప్పుడు మార్గంలో వెళ్తున్నాయన్న టెడ్రోస్.. ప్రపంచానికి ఈ వైరస్సే ప్రధాన శత్రువు అవుతుందన్నారు. ఇప్పట్లో ఇదివరకటి రోజులు రాకపోవచ్చని, వైరస్‌ని కంట్రోల్ చేయడమే మన ముందున్న విధి అని తెలిపారు. అదేవిధంగా వైర‌స్‌ను ప్ర‌పంచ‌దేశాలు ఎంత నియంత్రిస్తే, ఆయా దేశాలు త‌మ వ్యాపారాన్ని మొద‌లుపెట్ట‌వ‌చ్చు అని టెడ్రోస్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version