కరోనా బయటపడ్డ మార్కెట్ నుండి కీలక ఆధారాలు సేకరించిన WHO

-

వూహాన్ లోని ఒక మీట్ మార్కెట్ లో మొట్టమొదటి సారి కరోనా వైరస్ బయట పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని చైనా మాత్రం ఒప్పుకోవడం లేదు. వుహాన్ లో ఇప్పుడు డబ్యూ హెచ్ ఓ బృందం పర్యటిస్తోంది. ఈ క్రమంలోనే ఈ బృందం ఆ వూహన్ మార్కెట్ లో పర్యటించింది. ఈ సమయంలో కొన్ని కీలక ఆధారాలు సంపాదించినట్టు తెలుస్తోంది.

కరోనా కేసులు బయట పడిన వూహన్ లోని మాంసం మార్కెట్ ను చైనా ప్రభుత్వం శుభ్రం చేసిందని డబ్యూ హెచ్ ఓ బృందం గుర్తించింది. మాంసం మార్కెట్ లో దుకాణ దారులు వదిలి వెళ్ళిన పరికరాలను సామాగ్రి నుండి డబ్యూ హెచ్ ఓ బృందం సేకరించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి నేడో రేపో నివేదిక విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. మరి ఈ నివేదికలో ఎలాంటి సంచలన అంశాలు ఉంటాయో వేచి చూడాలి మరి. 

Read more RELATED
Recommended to you

Exit mobile version