పదో తరగతి బాలుడితో టీచర్ లవ్ ఎఫైర్…. అరెస్ట్ చేసిన పోలీసులు.

-

ఇటీవల కాలంలో కొంత మంది ఉపాధ్యాయులు.. విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ.. ఉపాధ్యాయ వృత్తికే చెడ్డ పేరు తెస్తున్నారు. బాలికను లైంగికంగా వేధించడంతో పాటు అత్యాచారాలు జరిగాయి. మాయమాటలు చెప్పో, బెదిరించో అమాయకపు బాలికలపై లైంగికంగా అఘాయిత్యాలకు పాల్పడ్డారు. విద్యా బుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులే ఇలా పక్క దారి పడుతున్నారు.

అయితే ఈసారి మాత్రం సీన్ రివర్స్ అయింది. లేడీ టీచర్ తన స్టూడెంట్ ను ప్రేమిస్తున్నానని వెంటపడింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రం అరియలూర్ జిల్లాలో జరిగింది. అరియలూర్ పట్టణంలో ఓ స్కూల్ లో పాఠాలు చెప్పే టీచరమ్మ… పదో తరగతి విద్యార్థి ప్రేమిస్తున్నానని వెంటపడింది. సదరు విద్యార్థిపై మనసు పారేసుకున్న ఉపాధ్యాయురాలి విషయం విద్యార్థి తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు పోలీస్ కేసు పెట్టారు.

విచారణ చేపట్టిన పోలీసులు ఉపాధ్యాయురాలిదే తప్పుగా తేల్చారు. విద్యార్జిని వేధించినందుకు సదరు ఉపాధ్యాయురాలిపై పోక్సో కేసు పెట్టారు పోలీసులు. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version