భారతదేశ కంపెనీ భారత్ బయోటెక్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి అత్యవసర వాడకంపై అనుమతి ఇంకా రాలేదు. ఈ విషయంలో ఆలస్యం జరుగుతూనే ఉంది. వ్యాక్సిన్ విషయంలో అనేక ప్రశ్నలకు భారత్ బయోటెక్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ పంపిందని సమాచారం. మరో పక్క అత్యవసర వాడకం అనుమతిపై భారత్ బయోటెక్, అన్ని పత్రాలను సమర్పించినట్లు తెలియజేసింది. అయినప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి అనుమతి రాలేదు.
ఈ కారణంగా ఇతర దేశాల్లో కోవ్యాక్సిన్ ను ఉపయోగించడానికి అవకాశం లేకుండా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అడిగిన వివరాలను మరికొద్ది రోజుల్లో వెల్లడి చేస్తామని, మరికొన్ని వారాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి అనుమతి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల పాటు ఇతర దేశాలకు వెళ్ళాలనుకునేవారికి ట్రావెల్ ఏజెన్సీలకు ఇబ్బంది కలగనుంది.