ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. రమేష్ కుమార్ ని ఎన్నికల సంఘం ప్రధాన అధికారిగా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడం లేదు. నాలుగు రోజుల క్రితం వచ్చిన తీర్పుతో ఇప్పుడు సిఎం వైఎస్ జగన్ ఆగ్రహంగా ఉన్నారు. రాజకీయంగా కూడా ఇది పెద్ద దుమారమే రేపుతుంది. ఈ తరుణంలో సిఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్ళడానికి సిద్దమయ్యారు.
ఇప్పుడు ఆయన ఉన్నపళంగా లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఆయన ఇప్పుడు ఢిల్లీ పర్యటనకు వెళ్తుంది కేవలం రెండు విషయాలకు అని వార్తలు వస్తున్నాయి. ఎల్జీ పాలిమర్స్ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వం మెడకు చుట్టుకునే అవకాశాలు కనపడుతున్నాయి. నిన్న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి ఇచ్చిన నివేదికలో కంపెనీ తప్పులు ఉన్నాయి.
అందుకే ఆయన ఢిల్లీ వెళ్తున్నారు అని అంటున్నారు. అదే విధంగా రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని వద్దు అనే విషయం కేంద్రానికి చెప్పి ఒప్పించాలి అని జగన్ భావిస్తున్నారు. ఇప్పుడు అందుకే ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అమిత్ షా తో జరిగే భేటీ లో ఆయన ఇదే విషయాన్ని ప్రస్తావించే సూచనలు ఉన్నాయి అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.