రానా మిహిక పెళ్ళి : అత్యుత్సాహం చూపిస్తున్న వాళ్ళకి సురేష్ బాబు సమాధానం ఏంటో తెలుసా ..?

-

టాలీవుడ్ టాల్ హీరో ఇన్నాళ్ళు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ గా ఉన్న దగ్గుబాటి రానా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. సోషల్ మీడియా ద్వారా రీసెంట్ గా తను ప్రేమించిన అమ్మాయిని పరిచయం చేసి సడన్ షాకిచ్చాడు రానా. అయితే ఈ మధ్యే ఇరు కుటుంబాల వారు కలిసి రోకా వేడుకను ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే. నిశ్చితార్థానికి ముందు అమ్మాయి అబ్బాయి లను మా వాళ్ళు అనిపించుకోవడం ఈ రోకా వేడుక ప్రత్యేకత. ఇక త్వరలోనే రానా మిహీక నిశ్చితార్ధం జరపనున్నారట. తాజా సమాచారం ప్రకారం అన్ని కుదిరితే రానున్న ఆగస్ట్ నెలలో రానా మిహీక లకి ఘనంగా పెళ్లి జరగనుందని తెలుస్తుంది. రోకా ఫంక్షన్ రోజే 2020 లోనే రానా మిహీక పెళ్లి చేస్తామని సురేష్ బాబు తెలియజేశారు.

 

 

ఈ నేపథ్యంలోనే ఆగస్టు లో వివాహ వేడుకని జరపాలని సన్నాహాలు చేస్తున్నారట. ఇప్పటి నుంచే పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారట. కరోనా కారణంగా హైదరాబాద్ లోనే అత్యంత సన్నిహితులు, బంధువుల మద్య రానా మిహీకాల వివాహం జరపనున్నారని సమాచారం. అయితే వీరి పెళ్లి కి ఆగస్ట్ 8 డేట్ ని ఫిక్స్ చేశారని సోషల్ మీడియాలో బాగా ప్రచారం అవుతోంది.

అంతేకాదు రానా మిహీకల పెళ్లి ముచ్చటగా మూడు రోజుల పాటు జరగనుందని ఆగష్టు 6, 7, 8 తేదీలలో పెళ్లి ఫిక్స్ చేశారని… 6, 7వ తేదీలలో వేడుకలు మొదలు పెట్టి 8న పెళ్లి ముహూర్తం నిర్ణయించారని వార్తలు వస్తున్నాయి. అలాగే తెలుగు సాంప్రదాయాం తో పాటు మార్వాడి సాంప్రదాయం ప్రకారం రెండు రకాలుగా ఈ పెళ్ళి జరపనున్నారని అంటున్నారు. అయితే ఈ విషయంలో రానా తండ్రి సురేష్ బాబు క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి వరకు రానా మిహీకల పెళ్లి తేదీని ఫిక్స్ చేయలేదని తెలిపినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. సోషల్ మీడియాలో వస్తున్నట్టు గా ఆగష్టు 8 వ తేదీ మంచిదైతే ఆ రోజే ఫిక్స్ చేస్తాము. కాని ఇంకా ప్రత్యేకించి ఏ డేట్ అనుకోలేదని అప్పటి వరకు డేట్ విషయంలో న్యూస్ రాయవద్దని అన్నట్టు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version