లెట్స్ ట్రోల్ : : ట్రిపుల్ ఆర్‌పై అత్యుత్సాహం ఎందుకు బ‌న్నీ..?

-

కొన్ని సార్లు అవ‌స‌రాలే మాట్లాడిస్తాయి
కొన్ని సార్లు విలువ‌లే అవ‌స‌రం అవుతాయి
పైకి క‌నిపించే పూత క‌రిగిపోతే విలువలు కూడా
గంగ‌పాలు అవుతాయి నీటి రాత‌లు అవుతాయి
అప్పుడు చెప్ప‌ను బ్ర‌ద‌ర్ అన్న డైలాగ్
బ‌య‌ట‌కు వ‌చ్చి మ‌రోసారి బ్రైన్ లో ర‌న్ అవ్వ‌డం ఖాయం

లెట్స్ ట్రోలింగ్ ..అవును ఈ మాటే ఇప్పుడు ప‌వ‌న్ అభిమానులు చెబుతున్నారు. త‌మ హీరో సినిమా విడుద‌ల‌యిన‌ప్పుడు మాట్లాడ‌రు. రికార్డులు కొట్టినా మాట్లాడరు. అదే అవ‌స‌రం ఉంటే ఆ సినిమాను ఆకాశానికి ఎత్తేయ‌డం ప‌చ్చి అవ‌కాశ వాదం..ఇదే నిజం కూడా! అని బ‌న్నీబాబును ఉద్దేశించి క‌ల్యాణ్ బాబు ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు. ట్రిపుల్ ఆర్ సినిమా విడుద‌ల‌యిన వెంట‌నే స్పందించి రాజ‌మౌళిని ప్ర‌శంసించిన బ‌న్నీకి త‌మ హీరో చిత్రం పాపం ఇన్నాళ్ల‌యినా క‌నిపించ‌క‌పోవ‌డం విడ్డూరం అని అంటున్నారు వీరంతా ! ఆ రోజు తాను మెగా కుటుంబంలో స‌భ్యుడ్ని అని ప్ర‌క‌టించుకున్న బ‌న్నీ, త‌రువాత ఆ కుటుంబంతో త‌న‌కేంటి సంబంధం అన్న విధంగా కొన్ని సార్లు సంకేతాలు ఇచ్చార‌ని, కొన్ని సార్లు ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్ ఒత్తిడిపై ప‌వ‌న్ ను ఉద్దేశించి ఎంతో అయిష్ట పూర్వ‌కంగా మాట్లాడి యాటిట్యూడ్ చూపించార‌ని కూడా వారు అంటున్నారు.గ‌తాన్ని గుర్తుచేసుకుంటూ ఆ రోజు ఆయ‌న చెప్ప‌ను బ్ర‌ద‌ర్ అంటూ చెప్పిన డైలాగ్ ను మ‌రో సారి ప్ర‌స్తావిస్తున్నారు.

వాస్త‌వానికి మెగా హీరోలు తామంతా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులమని, తాము అందరం ఒక్కటేనని, ఒక్కటిగా ఉంటామని చెబుతుంటారు. వీరంద‌రి క‌న్నా బ‌న్నీ విభిన్న‌మ‌ని, ఆయ‌న తత్వ‌మే వేరు అని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు కొందరు సోషల్ మీడియా వేదికగా చాలా కాలం నుంచి స్పందిస్తున్నారు. తన సినిమాకు మ‌రియు త‌న ఎదుగుద‌ల‌కు అవ‌స‌రం అనుకున్న ప్ర‌తిసారీ విలువ‌లు మాట్లాడే బ‌న్నీని ఉద్దేశించి ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ గురించి అల్లు అర్జున్ అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించి ట్వీట్ చేయడాన్ని కూడా వారు తప్పు పడుతున్నారు. ఇటీవల విడుదలైన జనసేనాని ‘భీమ్లా నాయక్’ ఫిల్మ్ విడుద‌ల‌య్యాక కనీస మాత్రంగానైనా స్పందించని బన్నీ.. ట్రిపుల్ ఆర్ పిక్చర్ గురించి ఆత్రం ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని పెద‌వి విరుస్తున్నారు.

ట్రిపుల్ ఆర్ సినిమాను ఆకాశానికి ఎత్తేయడమే కాదు హీరోలు..రాజమౌళి దర్శకత్వం, టేకింగ్ వ‌గైరా వ‌గైరా విష‌యాల గురించి స్పెషల్ గా ట్వీట్ చేశారు బన్నీ. ఇలా చేయడం వెనుక బన్నీకి దురుద్దేశం ఉందని కొందరు విమర్శిస్తున్నారు. తనకు అవసరమైనప్పుడు ‘చిరు’ నామ స్మరణ చేయడం, క‌లెక్ష‌న్ల‌కు సంబంధించి ఇష్యూస్ కానీ క్లాషెస్ కానీ వ‌స్తాయేమోనన్న బెంగ‌తో ముందుగానే జాగ్ర‌త్త పడి చిరు జ‌పం చేయ‌డం బన్నీకి అలవాటేనని ఆరోపిస్తూ ఉన్నారు.

మ‌రోవైపు భవిష్యత్తులో రాజమౌళితో అప్ కమింగ్ ప్రాజెక్టు ఒకటి అల్లు అర్జున్ ది ఉందని, అందుకే ముందు జాగ్ర‌త్త‌గా ట్రిపుల్ ఆర్ గురించి విడుద‌ల‌యిన వెంటనే స్పందించారని అంటున్నారు. ఈ క్రమంలోనే భీమ్లా నాయ‌క్ విడుద‌ల‌యిన‌ప్పుడు స్పందించ‌కుండా త‌మ ఓటీటీ ఆహాలో ఆ సినిమా స్ట్రీమ్ అయిన‌ప్పుడు బ‌న్నీ ఎందుక‌ని స్పందిస్తున్నాడ‌ని ఫైర్ అవుతున్నారు. ప్ర‌శ్నిస్తున్నారు. ‘ట్రిపుల్ ఆర్’ లో స్టార్స్ నటన గురించి ప్రస్తావిస్తూ..పవర్ హౌజ్ అని కామెంట్ చేసిన బన్నీకి ‘భీమ్లా నాయక్’ చిత్రంలో పవన్ కల్యాణ్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ కనిపించలేదా? అని మరో రూపంలో ప్ర‌శ్నాస్త్రాలు సంధిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version