ఏఈ కెమిస్ట్ జాబర్స్‌కు అపాయింట్మెంట్స్ లెటర్స్ ఎందుకిస్తలేరు? : ఆర్ఎస్పీ

-

తెలంగాణ జెన్ కో ఏఈ కెమిస్టు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్స్ ఎందుకు ఇవ్వడం లేదని బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ జెన్ కో సంస్థలో ఏం జరుగుతుందని, అపాయింట్మెంట్ లెటర్ల కోసం అభ్యర్థులు ఎంతకాలం ఎదురుచూడాలని ప్రశ్నించారు.

టీచర్లు, స్టాఫ్ నర్సులు, డిగ్రీ కాలేజీ లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, గ్రూప్-4 అభ్యర్థులందరికీ నియామక పత్రాలు ఇచ్చి వీరికి మాత్రమే ఎందుకు ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. సీఎండీ, ఉన్నతాధికారులు తమ చేతిలో ఏమీ లేదని, సంబంధిత మంత్రిని 4 సార్లు కలిసినా పట్టించుకోవడం లేదని ఆర్ఎస్పీ ఫైర్ అయ్యారు.పరీక్షలు పెడతారు? ఫలితాలు ప్రకటిస్తారు? సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేస్తారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకుంటరు. ఆఖరికి బాండ్ పేపర్ రాయించుకోని రోడ్ల మీద వదిలేస్తరా? అని ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version