నాగబాబుకు మంత్రి పదవి రావడంపై…ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో నాగబాబు మంత్రి వర్గంలోకి వస్తారని…. నాకు తెలిసి ఇక మార్పులు ఉండకపోవచ్చు అంటూ బాంబ్ పేల్చారు ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర. మచిలీపట్నం లో పేర్ని రైస్ పుల్లింగ్ జరిగిందని ఆగ్రహించారు. తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారని ఫైర్ అయ్యారు ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర.
కోర్టు కి వెళ్లాల్సిన అవసరం ఏమి ఉందని నిలదీశారు. మీ మేనేజర్ మీకు తెలియకుండా చేశాడా? అని ప్రశ్నించారు ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర. కేసు పై పూర్తి స్థాయి లో విచారణ జరుగుతుందన్నారు. అప్పటి వరకు అందరూ ఆగాల్సిందేనని పేర్కొన్నారు ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర.