పొంగులేటిపై ఈడీ ఎందుకు కేసు పెట్టలేదు : కేటీఆర్ సూటి ప్రశ్న

-

తెలంగాణ రెవెన్యూ, సమాచార మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఇటీవల ఈడీ అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటన జరిగిన తర్వాత అటు ఈడీ ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వకపోవడం ఆశ్చర్యకరంగా మారింది. నగదు పట్టుబడకపోతే అదే విషయాన్ని చెప్పాలి..ఎందుకు చెప్పలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా ప్రశ్నించారు.

ఇప్పటికే నెల రోజులు గడిచాయి. అయినా, ఎలాంటి అప్టేట్ లేదు. ‘ఈడీ, బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఒక్క మాట రావడం లేదు. భారీగా నగదు దొరికినట్లు మీడియాలో వచ్చినా కేసు కూడా ఫైల్ చేయలేదు. రైడ్స్ తర్వాత అదానీ హైదరాబాద్ వచ్చి రహస్యంగా పొంగులేటితో భేటీ అయ్యారు.ర ఇక్కడ క్విడ్ ప్రో కో ఏంటి? మీకేమైనా తెలుసా? అని తన ఎక్స్ అకౌంట్ వేదికగా కేటీఆర్ ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news