ఇదివరకు కంటే కూడా ప్రతి దాంట్లో కూడా మార్పులు వచ్చాయి అభివృద్ధి చెందడం వలన ప్రతి రంగం లో కూడా మనం ముందే ఉంటున్నాము. వైద్యంలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. ఇది వరకటితో పోల్చుకుంటే ఇప్పుడు వైద్య రంగంలో కూడా ఎంతో అభివృద్ధి వచ్చింది ఈజీగా ఆపరేషన్స్ వంటివి జరిగిపోతున్నాయి.
రకరకాల పరికరాలు కూడా మనకి ఎంతగానో సహాయం చేస్తున్నాయి. అయితే ఆసుపత్రిలో మీరు ఎప్పుడైనా గమనిస్తే గ్రీన్ కలర్ కార్ట్నెస్ ని కడుతూ ఉంటారు. అలానే ఆసుపత్రిలో పనిచేసే వైద్యులు ఆకుపచ్చ రంగు బట్టలని లేదంటే నీలం రంగు బట్టల్ని వేసుకుంటారు. ఎందుకు ఆకుపచ్చ రంగు నీలం రంగు మాత్రమే ఉపయోగిస్తారు..? ముఖ్యంగా సర్జరీ చేసే సమయంలో వైద్యులు ఆకుపచ్చ రంగు బట్టలు ఎందుకు వేసుకుంటారు లేదంటే నీలం రంగు బట్టలు ఎందుకు వేసుకుంటారు దాని వెనక కారణాలు ఇప్పుడు చూద్దాం.
ఊరికే డాక్టర్లు వేసుకోరు. దీని వెనుక సైన్స్ ఉంది. సర్జరీలు చేసే డాక్టర్లు నీలం రంగు లేదా ఆకుపచ్చ రంగు దుస్తులు ఎందుకు వేసుకుంటారు అంటే… మనం బయట వెల్తురు నుండి చీకటి గదిలోకి వెళ్ళినప్పుడు కళ్ళు ఒక్కసారిగా మసకబారుతాయి. దీనితో మనకి క్లియర్ గా అక్కడ ఏముంది అనేది కనపడదు. అలాంటి సమయంలో ఆకుపచ్చ రంగు కానీ నీలం రంగు కానీ కనబడితే రిలీఫ్ గా ఉంటుంది
ఇతర రంగులు ఉదాహరణకి ఎరుపు రంగు చూసుకుంటే మనకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. పైగా ఆకుపచ్చ రంగు నీలం రంగు మంచి ఫీలింగ్ ని ఇస్తాయి అందుకనే వైద్యులు ఆ రంగు బట్టల్ని వేసుకుంటారు. అలానే నీలం రంగు బట్టలు మీద రక్తం మరకలు పడినా అవి గోధుమ రంగులో కనబడతాయి అందుకే ఈ రంగుని వేసుకుంటూ ఉంటారు.