చనిపోయిన వారి ఊరేగింపులో డబ్బులు ఎందుకు చల్లుతారు..?

-

కుటుంబంలో ఎవరైన చనిపోతే.. ఆ కుటుంబసభ్యులు ఏడుస్తూ ఉంటారు. వారి విషయం పక్కన పెడితే.. అక్కడ శవం ఇంటికి వచ్చినప్పటి నుంచి దహనం చేసే వరకూ చాలా ఆచారాలను పాటిస్తుంటారు. వెంటనే ఒక దిక్కున మంట పెడతారు, కొత్తబట్టలు తెస్తారు, చనిపోయిన వారికి స్నానం చేపిస్తారు, సాంబ్రాని వేస్తారు, దహనం చేసేవారికి ఎలాంటి తాయత్తులు, రుద్రాక్షలు ఉంచరు, ఇలా చాలా ఉంటాయి. వాటిలో భాగంగానే అంత్యక్రియలకు తీసుకెళ్లప్పుడు డప్పులు, టపాసులు పేల్చుతారు. చిల్లర నాణాలేను మరమరాలలో వేసి దారంతా చల్లుకుంటూ పోతారు. ఎందుకు చనిపోయిన వారిని ఊరేగించేప్పుడు డబ్బులు ఇలా పడేస్తారు. జనరల్‌గా మనం డబ్బును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం. అలాంటిది ఇలా ఒక శవం ఊరేగింపులో చిల్లర నాణేలను రోడ్డంతా చల్లడం వెనుక ఉన్న కారణం ఏంటో తెలుసుకుందామా..!

 

మరణించిన వారు బ్రతికి ఉన్నప్పుడు ఎంత సంపాదించినప్పటికీ, చనిపోయిన తరువాత వారు ఒక్క రూపాయిని కూడా తీసుకెళ్లలేరు అని చెప్పడానికే ఇలా డబ్బులు చల్లుతారట. రేపు మీ పరిస్థితి కూడా ఇదే కాబట్టి న్యాయంగా, ధర్మంగా జీవించమని చెప్పడానికి కూడా ఇలా చేస్తారని కొందరు చెబుతారు.

చనిపోయినవారి అంతిమయాత్రలో డబ్బులు చల్లటం అనేది ఎన్నో ఏళ్లగా చూస్తూనే ఉన్నాం. ఇలా చల్లిన డబ్బులను ఎక్కువగా యాచకులు, చిన్నపిల్లలు ఏరుకుంటారు. ఈ విధంగా చేస్తే, నిరుపేదలకు మరణించిన వారి పేరు మీదుగా సహాయం చేశామనే తృప్తి వారి కుటుంబసభ్యులకు వుంటుందట. శవ యాత్రలో పూలు, పేలాలు చల్లటం వంటివి చాలా కాలం నుంచి ఉంది. పూలు చల్లడం అంటే మరణించిన వారిని గౌరవించడం, దేవునిగా భావించడం కావచ్చు.

పేలాలు చల్లడం వల్ల పక్షులు, క్రిమి కీటకాలకు ఆహారం వేసినట్టు భావన. ఇవి మనుషులకు కాదు అనడానికి గుర్తుగా ‘ హాస్యబ్రహ్మ ‘ జంధ్యాల గారు ఓ సినిమాలో ” శవం మీద పేలాలు ఏరుకుని తినే మొహం” అంటూ ఓ తిట్టు చేర్చారు!

బతికి ఉన్నప్పుడు మీరు ఎన్ని కోట్లు సంపాదించినా కడదాక మనతో పాటు మనం ఒక్క రూపాయి కూడా తీసుకెళ్లలేం. కానీ జీవితం అంతా ఆ డబ్బు కోసమే పోరాడతాం. ఎంత విచిత్రం కదా..!

Read more RELATED
Recommended to you

Exit mobile version