తెలంగాణలో జరుగుతోన్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్. ఖమ్మం జిల్లా నారాయణపురంలో మంత్రి సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో జరుగుతోన్న సమగ్ర కుటుంబ సర్వేను భవిష్యత్ లో దేశం మొత్తం రోల్ మోడల్ గా తీసుకుంటుందని పేర్కొన్నారు. ప్రజలంతా ఈ సర్వేకు సహకరించాలని కోరారు. రేపటి
నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వే జరుగనుంది.
రాష్ట్రంలో తొలి రెండ్రోజుల్లోనే 70 శాతం ఇళ్లను గుర్తించారు సిబ్బంది. కొన్ని జిల్లాల్లో 50 శాతం ఇళ్లను గుర్తించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటివరకూ రాష్ట్రంలో 1.17 కోట్ల కుటుంబాలున్నాయి. ఈ సర్వే పూర్తయితే ఆ సంఖ్య మరింత పెరుగుతుందని తెలుస్తోంది. ఇంటి యజమాని పేరు, వివరాలు, నంబరు తీసుకుని… సిబ్బంది ఇంటింటికీ స్టిక్కర్లు వేస్తున్నారు. ఈ స్టిక్కర్ పై గ్రామం, మున్సిపాలిటీ పేరు, వార్డు నంబర్, ఎన్యుమరేషన్ బ్లాక్ నంబర్, బ్లాక్ లో ఉన్న ఇళ్ల సంఖ్య ఉంటాయి.