ఫిబ్రవరి నెలలోనే 29వ రోజు ఎందుకు ఉంటుందో తెలుసా.. అస‌లు కార‌ణం ఇదే..!

-

ఫిబ్రవరి.. సంవత్సరములోని రెండవ నెల. 28 రోజులుండే ఈ నెల మిగతా అన్ని నెలల కన్నా చిన్నది. లీపు సంవత్సరములో మాత్రం ఈ నెలలో 29 రోజులు ఉంటాయి. అయితే 2020 సంవత్సరం ఒక ‘లీప్ ఇయర్’.. అంటే ఫిబ్రవరి నెలలో 28కి బదులుగా 29 రోజులు, మొత్తం రోజుల సంఖ్య 365కు బదులుగా 366గా ఉంటుంది. ఫిబ్రవరిలో 29వ తేదీ ఉండటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఏడాది ఆయుష్షులో అదనంగా మరో రోజు జీవించినట్లే అంటున్నారు. అసలు ఈ ఎక్స్‌ట్రా డే ఎందుకుంటుందో సింపుల్‌గా తెలుసుకుందాం.

ఈ లీప్ ఇయర్ ఎలా వచ్చిందంటే.. భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి 365 రోజుల 5 గంటల 48 నిమిషాల 46 సెకండ్లు పడుతుంది. అంటే 365 రోజులతో పాటు పావు రోజు పడుతుంది. పావు రోజును.. రోజుగా తీసుకోలేం కాబట్టి ప్రతీ నాలుగేళ్లల్లో నాలుగు పావు రోజుల్ని కలిపి.. ఒక రోజుగా పెట్టారు’. కాబట్టి లీప్ ఇయర్‌లో మరొక రోజు అదనంగా వస్తుంది. అయితే ఈ సూర్యుని భ్రమణం ఫిబ్రవరి నెల 28కి ముగుస్తుంది. కాబట్టి ఆ తర్వాతి రోజును 29గా పెట్టారు. మళ్లీ మార్చి నుంచి సూర్యుడి భ్రమణం మొదటి నుంచి మొదలవుతుంది. ఇదీ ఫిబ్రవరిలోని 29వ రోజు కథ. అందుకే ఫిబ్ర‌వ‌రి నెల‌లో 29వ రోజు ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version