ఉదయాన్నే పొగమంచు ఎందుకు ఏర్పడుతుంది.. కారణాలు ఇవే ?

-

చలికాలంలో పొగమంచు ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు పొగమంచు వల్ల రోడ్డుప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. అందుకే చాలా వాహనాలు పొగమంచు కారణంగా నెమ్మెదిగా వెళ్తుంచాయి. ఈ పొగమంచు ఫోటోలు తీయటానికి, ఇంట్లో ఉండి ఆస్వాదించటానికి ఒకింత బాగానే ఉంటుంది. ఆరోగ్యసమస్యలు..ఆస్తామాలాంటివి ఉన్నవారికి మాత్రం దీన్ని వల్ల ఎక్కడలేని సమస్యలే ఎదురవుతాయి. . ఇంకా గోదావరి జిల్లాలో అయితే ఉదయం ఆ కొబ్బరిచెట్లు, వరిపొలాలమీద ఈ పొగమంచు ఉంటే చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి. ఎంత అందంగా కనిపిస్తుందో. మీకు ఎప్పుడైనా అనిపించిందా..అసలు ఈ పొగమంచు ఉదయమే ఎందుకు వస్తుంది, అదీ శీతాకాలంలోనే ఎందుకు వస్తుంది అని..మాకూ అనిపించిది..అందుకే కొంత సమాచారాన్ని మీకు అందిస్తున్నాం.!

పొగమంచు అనేది ఒక రకమైన నీటి ఆవిరి. పొగమంచు సాధారణంగా చలికాలంలో ఏర్పడుతుంది. రాత్రి ఉష్ణోగ్రత బాగా తక్కువగా ఉండే రోజుల్లో ఈ పరిస్థితిని మనం ఎక్కువగా గమనించవచ్చు. గాలిలో నైట్రోజన్‌, ఆక్సిజన్‌ తదితర వాయువులతో పాటు నీటి ఆవిరి కూడా ఉంటుంది. దీనినే తేమ లేదా ఆర్ద్రత అంటారు. ఈ తేమ ఎంత ఉంటుందన్న విషయం గాలి పీడనం, ఉష్ణోగ్రతలను బట్టి ఉంటుంది. గాలి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే తేమశాతం ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రత తక్కువగా ఉంటే తేమ శాతం తక్కువగా ఉంటుంది.

ఒకవేళ గాలిలో ఉష్ణోగ్రత బాగా తగ్గిపోయిందనుకుందాం. అంతవరకూ గాలిలో ఎక్కువగా ఉన్న తేమ సూక్ష్మబిందువుల రూపంలో కరిగిపోతుంది. అదే ఈ పొగమంచు. ఈ సూక్ష్మబిందువులపై పడే కాంతి వివర్తనం చెంది అన్ని వైపులకు ప్రసరిస్తుంది. అందువల్ల అన్నీ కలిసి పొగలాగా కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితులు సాధారణంగా చలికాలంలోనే ఏర్పడుతుంది.

పొగమంచు, మంచు బిందువులు ఎలా ఏర్పడతాయంటే..

చలికాలంలో రాత్రుల్లో భూమి ఎక్కువగా వేడిని విడుదల చేస్తుంది. అలా వెలువడిన వేడి వాతావరణం పైపొరల్లోకి చేరుకోవడంతో భూమికి దగ్గరగా ఉండే పొరల్లో ఉష్ణోగ్రత చాలా వరకు తగ్గిపోతుంది. అప్పుడు భూమిపై ఉన్న గాలిలోని నీటియావిరి చల్లబడి, ఘనీభవించి చిన్న నీటి బిందువులు ఏర్పడతాయి. అవి భూమి ఉపరితలంపై ఉన్న దుమ్ము, ధూళివంటి అతి చిన్న కణాలను ఆవరించే గాలిలో తేలియాడడం వల్ల పొగమంచు ఏర్పడుతుంది. ఒక తెరలాగా ఇది ఏర్పడటంతో పొగమంచు వల్ల సరిగా కనపడుదు. అందుకే మనుషులును గుర్తించలే..ఎదురుగా వచ్చే వాహనాలు కూడా స్పష్టంగా తెలియవు.

చలికాలంలో భూమి ఎక్కువగా చల్లబడటం వల్ల నీటియావిరితో కూడిన గాలి నేలపై ఉన్న చల్లటి వస్తువులను, చెట్ల ఆకులను పూలను, పచ్చని గడ్డి పరకలను తాకడంతో వాటిపై ఆ నీటియావిరి ఘనీభవిస్తుంది. అదే ముత్యాల్లాగా మెరిసే మంచు బిందువులు. మనం కూడా ఉదయాన్నే వీటిని చూసేఉంటాం..చుక్కలు చుక్కలుగా ఏర్పడి ఉంటుంది. అయితే గాలిలోని నీటి ఆవిరి మొత్తాన్ని తేమ అంటారు. నీటి బిందువులు ఘనీభవించడం లేదా వాయువు నుండి ద్రవంగా మారడం ప్రారంభిస్తాయి. దీన్ని మంచుబిందువులు అంటారు.

ఏ కండీషన్ లో పొగమంచు ఏర్పడుతుంది.?

గాలి ఉష్ణోగ్రత, మంచు బిందువు మధ్య తేడా 2.5 °C (4.5 °F) కంటే తక్కువగా ఉన్నప్పుడు పొగమంచు ఏర్పడుతుంది. ఇంత జరుగుతుంది అనమాట పొగమంచు ఏర్పడటానికి. ఉదయం లేచిన కొన్ని గంటలు వరకు ఇది ఉంటుంది. ఎప్పుడైతే సూర్యుని కిరణాలు తాకుతాయో..ఇది మెల్లి మెల్లిగా తగ్గటం స్టాట్ అవుతుంది.

– Triveni BUskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version